దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా మరణాల్లో 78 శాతం బాధితులకు వేరే వ్యాధులు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్ఫష్టం చేసింది. ఇక తెలంగాణ లో నిన్న కొత్తగా 22 కరోనా కేసులు నమోదు కాగా మూడు మరణాలు సంభవించాయి అయితే ఈ ముగ్గురు కరోనా తోపాటు మరి కొన్ని రకాల వ్యాధులు కలిగివున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. మరణించిన ముగ్గురి లో ఇద్దరు పురుషులు కాగా మరొకరు మహిళ. వీరిలో 48 ఏళ్ళ వయసు గల వ్యక్తి షుగర్ తోపాటు బీపీ, స్థూలకాయం, న్యూమోనియా తో బాధాపడుతూ చనిపోగా రెండో వ్యక్తి కూడా గుండె, కిడ్నీ ,న్యూమోనియాతో బాధపడుతూ చనిపోయాడు. ఇక బాధిత మహిళా కూడా బీపీ ,షుగర్, న్యూమోనియా తో బాధపడుతూ మరణించిందని మంత్రి ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 1800 కరోనా కేసులు నమోదు అయ్యాయి దాంతో మొత్తం కేసుల సంఖ్య 34500దాటింది అందులో1000కి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కాగా నిన్న ఒక్క కేరళలో తప్ప దాదాపు కరోనా ప్రభావం అన్ని రాష్ట్రాల్లో భారీ స్థాయిలో  కేసులు నమోదయ్యాయి. మరోవైపు మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ కూడా ముగియనుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరోసారి లాక్ డౌన్ ను పొడిగించడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే లాక్ డౌన్ ను పొడిగిస్తే  మరి కొన్ని మినహాయింపులు వుంటాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: