దేశంలో కరోనా వైరస్ ని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  అయితే కరోనా వ్యాప్తి పూర్తి స్థాయిలో తగ్గకున్నా కొన్ని ప్రాంతాల్లో దాన్ని ప్రభావాన్ని మూడు రకాలుగా పరిగణించారు.  గ్రీన్, ఆరంజ్, రెడ్ జోన్లుగా కేంద్రం అంచనా వేసింది.  ఇక కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను రెడ్ జోన్లుగా పేర్కొన్నారు.   నిన్న మొన్నటివరకు ఎవరికైనా కరోనా వైరస్ వ్యాప్తి చెందిందంటే ఆ కాలనీని, పరిసర ప్రాంతాను కంటైన్మెంట్‌ జోన్ గా ప్రకటించేవారు. అంతే కాదు ఆ ప్రాంతానికి బయటివారు ఎవరూ వెల్లకుండా బారికేడ్‌లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించారు. 

 

అవసరమైన నిత్యావసర, అత్యవసర వస్తువులను జీహెచ్‌ఎంసీ సిబ్బందే అందజేసేవారు. కానీ ప్రస్తుతం అధికారులు ఆ పద్దతిని పాటించకుండా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపించినా, వైరస్ వ్యాప్తి చెందినా వారు బయటికి రాకుండా ఉండేందుకు వారందరినీ ఇంట్లోనే ఉంచి బయట నుంచి తాళం వేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో ఆ ప్రాంత ప్రజలకు కూడా బయటికి వెల్లకుండా ఆదేశాలు జారీ చేసేవారు.  నిత్యావసర వస్తువులు కావాలనుకుంటే వారికి సమీపంలో ఉన్న షాపుల ఫోన్ నంబర్లను అధికారులు బాధితుకు ఇస్తున్నారు. 

 

దీంతో వారు కాల్ చేయగానే వారికి కావలసిన వస్తువులు తమ ఇంటివద్దకే వస్తున్నాయి.  అయితే కరోనా మహ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ సమయంలో ప్రజలు కష్టం అనుకోకుండా ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు కోరతున్నారు.  తాజాగా కవాడిగూడలోని భాగ్యలక్షి్మకాలనీలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అంతే కాదు ఈ విధానాన్ని మొన్నటికి మొన్న మరో జిల్లాలో కూడా అమలు చేసారు.  తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 1061కి చేరింది. నిన్న ఒక్కరోజే 35 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: