కరోనా వైరస్ వల్ల దేశంలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పేద మరియు మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ ఆకలి కేకలు వినబడుతున్నాయి. చాలా వరకు అతి తక్కువ భూభాగంలో ప్రజలు ఎక్కువగా నివసించే దేశం పైగా అతి పెద్ద దేశం ఇండియా కావటంతో ఈ కరోనా వైరస్ వల్ల చాలా ఇబ్బందులు ప్రభుత్వాలు ఎదుర్కొన్నాయి. మొట్టమొదటిసారి ఇలాంటి విపత్కర మైన ఘటనలను ప్రభుత్వాలు ఎదుర్కోవడంతో తాజా పరిస్థితుల బట్టి కేంద్రం జనాభా నియంత్రణ మీద దృష్టి సారించింది. ఇటీవల దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓ ప్ర‌సంగం చేశారు.

 

అందులో భాగంగా మ‌న దేశంలో జ‌నాభా నియంత్ర‌ణ‌పై దృష్టిపెట్టాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి వ‌క్కాణించారు. ఇప్పుడు ఉన్న‌ట్లుండి జ‌నాభా నియంత్ర‌ణ గురించి రాష్ట్ర‌ప‌తి మాట్లాడ‌టంపై ఆస‌క్తి ఏర్ప‌డింది. దేశంలో జనాభా నియంత్రణ లేకపోవటం వల్లే కరోనా వ్యక్తి భయంకరంగా సోకిందని ఇన్ని వేల కేసులు బయట పడటానికి కారణం జనాభా నియంత్రణ లేకపోవడమే అని చాలామంది అంటున్నారు. మ‌న దేశం కంటే విస్తీర్ణంలో 3 రెట్లున్న అమెరికాలో 33 కోట్ల‌ జ‌నాభా మాత్ర‌మే ఉంద‌ని.. కానీ మ‌న జ‌నాభా 135 కోట్లు దాటిపోయింద‌ని.. ఈ జ‌నాభాకు త‌గ్గ‌ట్లుగా వ‌న‌రులు లేక భ‌విష్య‌త్తు ఆందోళ‌నక‌రంగా ఉండ‌బోతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.

 

జనాభా నియంత్రణ లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు కల్పించడం కూడా చాలా కష్టమవుతుందని అంటున్నారు. మరోపక్క మైనార్టీలో ఇది దేశంలో ముస్లింలను మోడీ సర్కార్ అణగదొక్కే ప్రక్రియలో భాగంగా ప్లాన్ అని ఆరోపిస్తున్నారు. కాని చాలా వరకు మేధావులు మరియు కొంతమంది ప్రముఖులు ...అతి తక్కువ భూభాగంలో జనాభా కలిగిన మన దేశంలో వైరస్ విస్తరిస్తే చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుందని అంటున్నారు. దీంతో రాష్ట్రపతి చెబుతున్నట్లు జనాభా నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: