పవన్ కి సినిమాల్లో యాభై రోజులు, వంద రోజులు కొత్త కాదు, కానీ రియల్ లైఫ్ లో అయితే పూర్తిగా కొత్తే. ఇక  చంద్రబాబుకు అంతా కొత్తే. అసలు ఆయన్ని అలా చూడడం జనాలకు కూడా కొత్తే చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇన్ని రోజులు ఒకే చోట. తన సొంత ఇంట్లో ఉండడం అంటే మాటలు కాదు, కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ కారణంగా ఆయన హైదరాబాద్ లో ఉండిపోయారు. ఇక పవన్ కూడా డిటో డిటో.

 

ఇపుడు లాక్ డౌన్ కి యాభై రోజులు పూర్తి అయిన సందర్భంగా ఈ ఇద్దరూ కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో యాభై రోజులు పూర్తి చేసుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు ఈ యాభై రోజుల్లో ఎన్నో జరిగాయి. జరుగుతున్నాయి. ఏపీలోకి మాత్రం బాబు. పవన్  ఈ రొజు దాకా అడుగుపెట్టడంలేదు ఈ మధ్య విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన తరువాత చంద్రబాబు ప్రత్యేక విమానంలో వైజాగ్ రావాలనుకున్నారు. అయితే బాబు కేంద్రాన్ని పర్మిష‌న్ అడిగారు. దాని ఎస్ అని  కేంద్రం ఏమీ చెప్పకపోవడంతో బాబు రాలేకపోయారు.

 

మరో వైపు పవన్ కూడా విశాఖ వస్తారని అంతా అన్నారు. కానీ ఆయన కూడా రాలేకపోయారు. మొత్తానికి లాక్ డౌన్ని పూర్తిగా పాటిస్తున్న నేతలుగా బాబు, పవన్ రికార్డ్ క్రియేట్ చేశారనుకోవాలి. ఇక లాక్ డౌన్ సడలింపులు ఈ నెల 18 నుంచి ఉంటాయని అంటున్నారు. అపుడైనా ఈ ఇద్దరు నేతలూ ఏపీకి వస్తారని అనుకోవాలా అన్న సందేహాలు ఉన్నాయి. ఇక మరో వైపు ఏపీలో ఓ వైపు పాలన చేస్తూనే మరో వైపు తన పధకాలను జగన్ అమలు చేస్తున్నారు. ఇంకో వైపు విధానపరమైన నిర్ణయాలు కూడా చకచకా తీసేసుకుంటున్నారు.

 

మరి ఇన్ని రకాల రాజకీయాలు జరుగుతుంటే బాబు మాత్రం హైదరాబాద్ లో ఉండిపోవడం తమ్ముళ్లకు కూడా నిరాశగా ఉంది. ఇంకో వైపు చూస్తే టీడీపీ పార్టీని జూమ్ పార్టీగా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఇవన్నీ చూసినపుడు బాబు పవన్ ఇంకా పొరుగు రాష్ట్రంలోనే ఉంటారా లేక ఏపీ వైపు వచ్చే ఆలోచన చేస్తారా అన్నది చూడాలి. బాబు ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్స్ మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వరా సెటైర్లు వేశారు కూడా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: