అసలే కరోనా సమయంచిన్న తప్పు జరిగితే చాలు ప్రభుత్వాన్ని ఎక్కి తొక్కేద్దామని రెడీ గా ఉన్న విపక్షాలు. అదీ కాకుండా మొదట్లో పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర కరోనా తాకిడి ఎక్కువగా ఉంది. జగన్ పైన విమర్శలు…. పక్క రాష్ట్ర సీఎం లకు పట్టాభిషేకాలు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా అధికార పార్టీకి వ్యతిరేకంగా మారగా…. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోలుస్తూ జగన్ ను తక్కువ చేసి చూపించడం మీడియా వారు బాగా వంట పట్టించుకున్నారు.

 

అయితే జగన్ మాత్రం కరోనా ఈరోజు ఉంటుంది రేపు వెళ్లిపోతుంది కానీ తాను ముఖ్యమంత్రిగా చేయవలసిన అభివృద్ధి పనులు మరియు జరగాల్సిన కార్యక్రమాలే తనను నాయకుడిగా నిలబడతాయని గట్టిగా నమ్మారుఅందుకు తగ్గ కార్యాచరణ షురూ చేశారు కూడా. దెబ్బతో జగన్ ఇమేజ్ ఏపీలో అమాంతంగా పెరిగింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

 

ఆర్థిక సంక్షోభంలో కూడా వేల కోట్లు ఖర్చు చేయవలసిన సంక్షేమ పథకాలపై ఎటువంటి ఆంక్షలు విధించకుండా కెసిఆర్ లాంటి లీడర్ నే ఢీకొనేందుకు సిద్ధపడ్డాడు. రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేసిన జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 40వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కులకు పెంచగలిగితే రాయలసీమలో జగన్ ను కొట్టేవారే లేరంటున్నారు విశ్లేషకులు

 

ఇప్పుడు జగన్ కేసీఆర్ ను సైతం థిక్కరిస్తుండం ఏపీలో జగన్ కు భారీ మైలేజ్ లభించినట్లేనంటున్నారు. కేసీఆర్ ను ఢీకొనగలిగే సత్తా ఒక్క జగన్ కే ఉందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పడుతున్నాయి. పోతిరెడ్డి పాడు విషయంలో ఏం జరిగినా ఇప్పటికే జగన్ మైలేజీ పెరిగిందన్నది కాదనలేని వాస్తవం. ఇక కరోనా వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని జగన్ తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలు చూసి విపక్షాలు నోర్లు వెళ్ళబెడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: