కేసీయార్ అంటేనే మొనగాడు అంటారు. ఆయన తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన ఘనాపాటి. ఎవరూ తెలంగాణా వస్తుందని అనుకోలేదు. అదొక విఫల ప్రయోగంగా భావిస్తూ వచ్చారు. పదవులు దక్కని వారు తెలంగాణాను అడ్డం పెట్టుకుని పంతం నెగ్గించుకోవడానికి వాడుకునే అస్త్రంగానే చూసారు. కానీ కేసీయార్ కారణ జన్ముడు, పైగా రణజన్ముడు కూడా. అందుకే ఆయన తెలంగాణాను తెచ్చి చూపించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.

 

ఇక కేసీయార్ కి మొదటి నుంచి చంద్రబాబుతోనే వైరం. టీడీపీలో ఉన్నపుడు కూడా కేసీయార్ బాబుకు నీడలా ఎపుడూ ఉండేవారు కాదు, సొంత వ్యక్తిత్వం చూపించేవారు. ఇక తెలంగాణా ఉద్యమ నేతగా కేసీయార్ ఇమేజ్ ఆకాశానికి తాకిన వేళ  పొలిటికల్ గా చంద్రబాబు బాగా తగ్గిపోయారు. దాంతో కేసీయార్ కి బాబుని ఆడుకోవడం మరింత సులువు అయింది. ఇక రాజకీయ తెలివిడితో జగన్ కేసీయార్ తో దోస్తీ చేస్తేనే బెటర్ అని  అనుకున్నాడు.

 

కానీ కేసీయార్ తో పెట్టుకుని ఓడిపోయిన ప్రతీసారి దోస్తీ అంటూ చంద్రబాబు తనదైన పొలిటికల్ గేమ్స్ ఆడుతూ వెళ్లారు. దాంతో బాబుని మొత్తానికి చదివేసిన కేసీయార్ ఆ తరువాత  ఆయన్ని ఏ దశలోనూ నమ్మడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ ఏపీ సీఎంగా ఉన్నారు. ఆయన పోతిరెడ్దిపాడు ఎత్తిపోతల పధకానికి గాను సామర్ధ్యాన్ని పెంచుతూ జీవో తెచ్చారు. నిజానికి కేసీయార్ ఏమైనా అంటే జగన్ని అనాలి. కానీ ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లుగా చంద్రబాబు మీద పడడమే విశేషం.

 

బాబు బాబ్లీ పేరిట భోగస్ ఉద్యమం నడిపారని, ఆయన బాబ్లీకి వెళ్లి సాధించింది ఏంటీ అంటూ కేసీయార్ గట్టిగానే బాణాలను గుచ్చేశారు. బస్తీ మే సవాల్ అంటూ ఏపీ సీఎం గా ఉన్నపుడు చంద్రబాబు జబ్బలు చరచి సాధించింది శూన్యమని గాలి తీసేశారు. చంద్రబాబు ది అంతా ఉత్త  మాటల పోరాటామేనని కూడా ఒక్క దెబ్బకు తేల్చేశారు. 

 

మొత్తం మీద కేసేయర్ జగన్ ల మధ్య జల వివాదం రాజుకుని ఇద్దరూ ఘర్షణ పడతారని ఆశించిన ఏపీలోని విపక్షాలకు, బాబుకూ  పూర్తిగా నిరాశ కలగడమే కాదు, కేసీయార్ బాబుతో చెడుగుడు ఆడడం బట్టి చూస్తూంటే షాకే మరి. బాబు ఎక్కడా  పల్లెత్తు మాట అనకుండా ఎంత మంచిగా ఉన్నా కూడా కేసీయార్ బాబునే టార్గెట్ చేయడంతో ప్చ్చ పార్టీ తమ్ముళ్ళు ప‌రేషన్ అవుతున్నారు.  మొత్తానికి కేసీయార్ ఏపీలో తన ఆజన్మ రాజకీయ శత్రువు ఎవరో మరో మారు చెప్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: