రేవంత్ రెడ్డి.. తెలంగాణలో కాస్త బలమైన వాయిస్ ఉన్న నాయకుడు. తెలుగు దేశంలో లైఫ్ లేదని తెలుసుకుని కాంగ్రెస్ లోకి వచ్చేశాడు. కాంగ్రెస్ లో తన పరిస్థితి అంత గొప్పగా లేకపోయినా ఆ పార్టీలో బలమైన వాయిస్ ఉన్న నాయకుడు లేకపోవడం రేవంత్ రెడ్డికి కలసి వచ్చింది. అందులోనూ మొదటి నుంచి కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన నాయకుడు కావడంతో రేవంత్ రెడ్డి అంటే కాస్త క్రేజ్ ఎక్కువే.

 

 

అయితే అలాంటి రేవంత్ రెడ్డి.. తన జీవితం ఆరంభంలో ఏం పని చేశారో తెలుసా.. అంటూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. వారు చెప్పేదాన్ని బట్టి చూస్తే.. రేవంత్ రెడ్డి పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించాడట. ఆ తర్వాత అక్రమాల ద్వారా వేల కోట్లు ఎలా సంపాదించాడట. మంత్రి కేటీఆర్ ను విమర్శించిన రేవంత్.. ఓ బ్లాక్ మెయిలర్ అని వారు ఆరోపిస్తున్నారు. రేవంత్‌ ఆరోపణలకు కేటీఆర్‌ సమాధానం కూడా చెప్పారని, అనవసర ఆరోపణలు చేయడం సరికాదని అంటున్నారు.

 

 

టీఆర్ఎస్ నేతలు ఇంకా ఏమంటున్నారంటే.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారట. ఓటుకు నోటు కేసు చూసి రాజకీయాలు ఇలా ఉంటాయా అని సిగ్గుపడ్డారట. ఉప్పల్‌లో రేవంత్ రెడ్డి కొనుగోలు చేసిన భూముల సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాము వాటిని బయటపెడితే ఇప్పటి వరకు సమాధానం లేదని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు.. గోపన్‌పల్లిలో దళితుల భూములను లాక్కున వ్యక్తి రేవంత్‌ అని మండిపడుతున్నారు.

 

 

రేవంత్ రెడ్డి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే బురద చల్లుతున్నారని టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. 111 జీవో పరిధిలో ఎరెవరికి భూములున్నాయో బయటపెడతామన్నారు. రేవంత్‌రెడ్డి చూపించిన భూములు కేటీఆర్‌వి కావంటున్నారు. మంత్రి కేటీఆర్‌ ఎదుగుదలను జీర్ణించుకోలేకే కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరి నిజానిజాలు ఆ దేవుడికే ఎరుక..!

మరింత సమాచారం తెలుసుకోండి: