దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం, పౌరులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా కూడా కరోనా కేసులు పెద్దగా తగ్గుముఖం పట్టట్లేదు. విధించిన లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. దీంతో ప్రజలు భారీగా రోడ్ల మీదకు వస్తున్నారు. 

 

కేంద్రం, రాష్ట్రాలు విధించిన నిబంధనలు పాటించడం లేదు. భౌతిక దూరం అస్సలు పాటించకపోతుండడం తీవ్ర ఆందోళన రేకేత్తిస్తోంది. ఒక్కరిలో కూడా భయం, బాధ్యత అనేది కనిపించడం లేదు. ఈ నెల ప్రారంభం నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కేసులు రికార్డవుతున్నాయి.

 

ఊహించని విపత్తులా దూసుకొచ్చిన ప్రాణాంత కరోనా వైరస్‌ పౌరుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. వైరస్‌ వ్యాప్తికి విధించిన లాక్‌డౌన్‌ పలు ప్రాంతాల్లో ఆకలి చావులకు దారితీస్తోంది. ఇక వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ముఖ్యంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక తిండికరువై అల్లాడుతున్నారు. రొట్టె, నీళ్లు తాగి ఉండాల్సి వస్తుంది. ఒక్కో రోజు కనీసం ఏమీ దొరకదు. గడిచిన రెండునెలల్లో చాలాసార్లు పస్తులు ఉన్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఉత్తరభారతంలో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్నారు. కరోనా విపత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దత్తత గ్రామంలోనూ ఆకలి కేకలు పుట్టిస్తోంది. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గానికి కూతవేటు దూరంగా ఉన్న దోమరి గ్రామస్తులు తిండిలేక అలమటిస్తున్నారు. లాక్‌డౌన్‌తో తన పది నెలల పాపకు కనీసం పాలు కూడా పట్టలేని పరిస్థితి ఎదురైందని స్థానిక మహిళా రంజూ దేవీ తన గోడును వెళ్లబోసుకున్నారు.

 

లాక్‌డౌన్‌కు ముందు రోజూ రూ. 60తో పిల్లలకు పాలు, బిస్కెట్స్‌ కొనిపెట్టే వాళ్లమని, ప్రస్తుతం రూ.20తో రోజంతా సరిపుచ్చుతున్నామని చెప్పుకొచ్చారు. తన భర్త ఇంతకుముందు చేపలవేటకు వెళ్లి రోజూ రూ. 300 వరకు సంపాదించేవారని, ఇప్పుడు అది కూడా లేకపోవడంతో ఇళ్లు గడవడం కష్టతరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: