నిన్ననే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలు వారివారి సరిహద్దులను ఎత్తివేస్తున్నారన్న వార్త ఒక పుకారులా లేచింది. వైరస్ కట్టడి కోసం అమలు చేసిన లాక్ డౌన్ వల్ల ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది విషయం తెలిసిందే. అయితే కేంద్రం దాదాపు రెండు నెలల పటిష్ట లాక్ డౌన్ తర్వాత విడత లవారీగా సడలింపు ఇస్తూ వచ్చింది. వైరస్ సోకకుండా నియమాలు పాటిస్తూ ప్రయాణం చేయడానికి కూడా అనుమతి ఇచ్చింది. అయితే లాక్ డౌన్ నుండి మినహాయింపులు వచ్చిన తర్వాత దేశం లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో కొన్ని విషయాల్లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా పట్టింపులతో ఉన్నాయి.

 

ఇక తెలంగాణ మరియు ఆంధ్ర ప్రభుత్వ లు తమ సరిహద్దులను ఎత్తివేయడం లేదని స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ మహానగరానికి రోడ్డు రవాణా లేకుండా పోయింది. ఇక హైదరాబాద్ లో కూడా ఆంధ్ర వాసులు ఇరుక్కొని ఉన్న వారు తమ సొంత ఊళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లో బస్సులు పరిమితంగా నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ ఇతర రాష్ట్రాలకు ఎక్కడికీ బస్సులను నడపడం లేదు. ఏపీ నుండి మీ రాష్ట్రాలకు బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు లేఖలు రాసినా.... పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా నుండి ఎటువంటి స్పందన లేదు.

 

రోజు  నుంచి గుళ్లు షాపింగ్ మాల్స్ హోటళ్లు రెస్టారెంట్లు కూడా పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు మరికొన్ని రోజులు వేచిచూసే ధోరణి అవలంబించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ - కర్నాటక - తమిళనాడు ఒడిశా వంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉంది. పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్ధితి. ఇలాంటి నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సులను తిప్పితే పరిస్ధితి చేజారుతుందనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. దీనితో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకో లేకపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: