వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే అసలే ఇప్పుడు కరోనా వైరస్ సమయంలో ఉన్నాము.. అలాంటి ఈ సమయంలో భారీ వర్షం పడడం.. అంటే వర్షం పడడం మంచిదే.. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయ్.. ఈ వర్షం కారణంగా కాస్త కూల్ అవుతుంది. ఇంత వరకు ఓకే. కానీ అతి భారీ వర్షం పడి రైల్వే ట్రాక్ ఏ కొట్టుకుపోయేంత భారీ వర్షం పడితే ఏలా? ఇంకా ఏం చెయ్యగలం చూస్తూ ఉండటం తప్ప.   

 

సరే.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు జిల్లాలలో వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నాయి.  ఇంకా ఈ వర్షాలకు జిల్లాలోని బేస్తవారిపేట మండలం జగ్గంబొట్ల కృష్ణాపురం వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌ మొత్తం దెబ్బతినింది. వరద నీరు పొంగి పొర్లడంతో అక్కడ రైల్వే పట్టాలు ఉన్నాయ్ అనేది కూడా కనిపించకుండా పోయాయి. వరద నీరు అంత రైల్వే ట్రాక్‌ పై నుంచే ప్రవహిస్తున్నాయి. 

 

అయితే ఇక్కడ ఆనందిచాల్సిన విషయం ఏంటి అంటే? ఆ మార్గంలో ప్రస్తుతం రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అని అధికారులు భావిస్తున్నారు. అయితే గుంటూరు - గుంతకల్లు మధ్య నడిచే సరకు రవాణా రైళ్లకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాదు కంభం-సోమిదేవిపల్లి మార్గమధ్యలో రైల్వే స్తంబాలు కూడా భారీ వర్షాలకు కుప్పకూలిపోయాయి. మరో వైపు గుంటూరు-గుంతకల్లు రైల్వే లైనులో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో చోట్లా భారీ వర్షాలు కురుస్తున్నాయి.                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: