బాలయ్య బాబు మంచి హుషారు మీద ఉన్నాడు. 60 ఏళ్ల వయసులో అడుగు పెట్టినా  ఇంకా కుర్రవాడిలాగే హడావుడి చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని విషయాల పైన స్పందిస్తున్నాడు. అంతకుముందు ఎప్పుడూ మీడియా ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఆసక్తి చూపించని బాలయ్య ఇప్పుడు ప్రతి మీడియా ఛానెల్ లోనూ కనిపిస్తున్నాడు. చివరికి యూట్యూబ్ ఛానెళ్ళకి కూడా ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు. వచ్చినవాడు మాములు విషయాలు మాట్లాడుతున్నాడా ..? అబ్బే తన మనస్సుల్లో ఉన్నవి, ఎవరికీ తెలియని ఎన్నో సంగతులు చెప్పేస్తునందు. అసలు బాలయ్య స్వభావానికే ఇది విరుద్ధం. ఈ విధంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆశ్చర్యం తో పాటు, అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.

IHG


ఇక మెగాస్టార్ చిరంజీవి వంటి వారితో సై అంటే సై అంటూ సవాలు విసురుతున్నాడు. అసలు బాలయ్య ఎందుకు ఇంత యాక్టివ్ గా ఉంటూ హడావుడి చేస్తున్నాడు అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు 70 సంవత్సరాల వయసులో అడుగుపెట్టారు. ఎంతో కాలం పార్టీని యాక్టివ్ గా ముందుకు నడిపించే అవకాశం ఆయనకు లేదు. దీంతో పార్టీ బాధ్యతలు కీలకమైన వ్యక్తులకు అప్పగించి లోకేష్ కు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సమయంలో బాగా యాక్టివ్ గా ఉంటూ బాలయ్య హడావుడి చేస్తున్నారు. ఆయన పొలిటికల్ గా ఏదో ఆశిస్తున్నారనే అనుమానాలు అయితే అందరిలోనూ బయలుదేరాయి. ప్రస్తుతం బాలయ్య వయస్సు 60 సంవత్సరాలు. 

 


ఎన్టీఆర్ కూడా 60 సంవత్సరాల వయసులోనే తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు. తొమ్మిది నెలల సమయంలోనే పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య యాక్టివ్ గా ఉన్నా.. బావ చంద్రబాబు చెప్తే సరే అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఇక తన అల్లుడు నారా లోకేష్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఈ క్రమంలో పార్టీని ముందు సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్లాలంటే అది తన వల్లే సాధ్యం అవుతుందనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ముందు చూపుతోనే అప్పట్లో తాను దూరం పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ను సైతం దగ్గర చేసుకున్నాడని, తన పుట్టిన రోజు వేడుకల పేరుతో కుటుంబ సభ్యులందరినీ ఒక చోట చేర్చి వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

IHG


తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఎప్పటికైనా వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టు పోయేది నేనే అంటూ బాలయ్య వ్యాఖ్యానించడం చూస్తుంటే, బాలయ్య టీడీపీలో పెద్ద పదవి పైనే కన్నేసినట్టుగా కనిపిస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు ఓసారి విదేశాలకు వెళ్లగా, ఆ సమయంలో చంద్రబాబు కుర్చీలో బాలయ్య కూర్చుని సంచలనం రేపారు. ఇప్పుడు బాలయ్య వ్యవహారశైలి చూస్తుంటే బావ కుర్చీపై కన్నేశాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి ? ఏమో అదీ జరగవచ్చు. ఎందుకంటే ఇది ఇది రాజకీయం 'బాబు'.

మరింత సమాచారం తెలుసుకోండి: