గత కొన్ని రోజులతో పోలిస్తే కేరళలో ఈరోజు కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 54 పాజిటివ్ కేసులు నమోదు 56 మంది బాధితులు కోలుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో ఇప్పటివరకు మొత్తం 2461కేసులు నమోదుకాగా అందులో1340కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు1101మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 19మంది మరణించారు. 
 ఇక దేశ వ్యాప్తంగా మిగితా రాష్ట్రాల్లో ఈరోజు కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా మహారాష్ట్ర లో ఈఒక్క రోజే  3390కేసులు నమోదు కాగా ఢిల్లీ లో 2224, తమిళనాడు లో 1974, గుజరాత్ లో 511 అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు కూడా దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 11000 దాటనుంది.
 
ఇక ఓవరాల్ గా ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 332800కు చేరగా 9400 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. కాగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఈనెల 16,17న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: