ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మొదట తన ప్రసంగం ద్వారా ఏడాది ప్రభుత్వ పరిపాలన పై ప్రశంసల వర్షం కురిపించారు. ఉదయం 10 గంటలకు సభ మొదలు కావడంతో ఆన్లైన్ ద్వారా గవర్నర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టి...ఏడాది పరిపాలనలో ప్రభుత్వం అమలు చేసిన నిర్ణయాలు గురించి పథకాలు గురించి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను అభినందించారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం చేయటం జరిగింది.

IHG

ఈ సందర్భంగా 224789 కోట్ల బడ్జెట్ ను మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. కరోనా వైరస్ పై పోరులో ఎపి ముందంజలో ఉందని చెప్పుకొచ్చారు. విద్యారంగానికి ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనుకాడరాదన్నది ముఖ్యమంత్రి జగన్ బావన అని, అందుకే అమ్మ ఒడి స్కీమ్ కింద పదిహేనువేల రూపాయల చొప్పున పిల్లల తల్లులకు ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు అమలు చేస్తున్నట్లు తెలిపారు.IHG

ఈ పదకం కింద మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. పిల్లలకు డ్రెస్, బుక్స్ లతో కూడిన కిట్ ఇస్తున్నామని , పిల్లలకు మంచి ఆహారం ఇవ్వడానికి ‘జగనన్న గోరుముద్ద’ స్కీమ్ అమలు చేస్తున్నామని తెలిపారు. ఒక తండ్రి మాదిరి ముఖ్యమంత్రి పిల్లలకు మెనూ నిర్ణయించారని అన్నారు. ప్రాదమిక, ఇంటర్ విద్యలకు 11604 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు 2277 కోట్లు ఇస్తామని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: