తెలంగాణలో ఇంటర్ పలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రాసెస్‌ పూర్తి చేసిన బోర్డు.. పూర్తి రిపోర్ట్ ను ప్రభుత్వానికి పంపింది. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. ఫలితాల విడుదల తేదీ కూడా తేలిపోయింది. రేపు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పలితాలు ఒకటే సారి విడుదల కానున్నాయి.

 

తెలంగాణలో కరోనా లాక్‌డౌన్‌కు ముందే ముగిసిన ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు... ఎట్టకేలకు రేపు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి తతంగమంతా పూర్తయినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. మార్చి 4 నుండి మార్చి 18 వరకు జరిగిన పరీక్షలకు 9 లక్షల 65 వేల 839 మంది విద్యార్థులు హాజరు కాగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు నాలుగు లక్షల 80 వేల 516 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నాలుగు లక్షల 85 వేల 323 మంది ఉన్నారు.

 

కరోనా విజృంభణను అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ విధించడంతో... పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ ఆలస్యమైంది. ఇటీవల లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం అనుమతినివ్వడంతో  మూల్యాంకనం పూర్తయ్యింది. ఇంటర్ మొదటి,ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కు చెందిన 53 లక్షల 91 వేల ఆన్సర్ షీట్లు దిద్దడం పూర్తవడంతో.. కోడింగ్, డికోడింగ్, స్కానింగ్ ప్రక్రియలను ఇంటర్ బోర్డ్ కంప్లిట్ చేసింది. గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంది. 

 

29 అంశాల పై ప్రత్యేక దృష్టిన అధికారులు.. పలితాల ప్రాసెసింగ్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేశామని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. అంతా ఓకే అనుకున్నాకే.. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చామని, తదుపరి ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకున్నారు. . కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్,సెకండ్ ఇయర్ పలితాలు ఒకేసారి రేపు విడుదల కానున్నట్టు ఇంటర్ బోర్డ్ అధికారులు స్పష్టం చేశారు.
మరికొన్ని గంటల్లోనే ఇంటర్‌ రిజల్ట్స్‌ విడుదల కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: