ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన  నాటి నుంచే రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టారు. అధికారంలో లోకి వచ్చిన ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి ఎన్నో మార్పులను చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వివిధ పరిశ్రమలు, ఐటి రంగం లో వస్తున్న సాంకేతిక మార్పులను పరిగణలోకి తీసుకుని  విద్యార్థులకు నైపుణ్యాన్నీ పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. 

 

 

ఇదే అంశంపై మాట్లాడిన ఆయన....నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కంపెనీల మధ్య నిరంతరం సంబంధాలుండాలని తెలిపారు. ఏపీలో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలపై సీఎం తన క్యాంపు కార్యాలయం లో గురువారం సమీక్ష నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 30 చోట్ల స్కిల్ డెవలప్మెంట్ కళాశాలల నిర్మాణ నమూనాలను ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. కాలేజీల నిర్మాణం పూర్తైన తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ చదివిన విద్యార్థుల వివరాలపై సర్వే చేయించాలని సీఎం అధికారులకు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలని, ఈలోగా పరిశ్రమలకు అవసరాలు ఏంటో తెలుసుకోవాలని అధికారులకు తెలియజేసారు. 

 

 

వీటిలో 120 కోర్సుల్లో బోధన, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, అంతర్జాతీయ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి కోర్సుల్లో కియా, ఐటీసీ, టెక్ మహీంద్ర, హెచ్ సీఎల్, హ్యూందాయ్, వోల్వో, బాష్ కంపెనీలను భాగస్వామ్యం చేయనున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏపీఎస్ సీహెచ్ఈ, ఐఐఐటీ బోధనా సిబ్బందితో అడ్వాన్స్డ్ కోర్సుల్లో శిక్షణ అందించనున్నారు. 30 కాలేజీల నిర్మాణానికి రూ .1210 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ ఆలోచన అమలులోకి వస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, తద్వారా నైపుణ్యం కలిగిన విద్యార్థులు తయారువుతారని పలువురు విద్యావేత్తలు, నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: