గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యాక టీడీపీ అడ్రెస్ లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వదిలేసి వైఎస్సార్‌సీపీలోకి వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది నేతలు నియోజకవర్గాల్లో అడ్రెస్ ఉండటం లేదు. ఏదో అక్కడక్కడ మాత్రం కొందరు టీడీపీ నేతలు యాక్టివ్‌గా ఉంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం వల్ల, కేడర్ చెల్లాచెదురైపోతుంది.
అదే సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మంచి పనితీరు కరబర్చడంతో నియోజకవర్గంలో టీడీపీ ఊసే రావడం లేదు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సింహాద్రి రమేష్ బాబు మంచిపనితీరుతో దూసుకెళుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉన్నారు. సమస్యలు ఏమన్నా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అటు కొత్తగా సిసి రోడ్ల, అండర్ డ్రైనేజ్‌ల నిర్మాణం జరుగుతుంది.
అయితే నియోజకవర్గంలో బాగోని రోడ్లపై కూడా ఎమ్మెల్యే ఫోకస్ చేసి వాటిని బాగుచేసేందుకు కృషి చేస్తున్నారు. అటు నాగాయలంక-మచిలీపట్నం బైపాస్ రోడ్లు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక లక్ష్మీపురం-ఘంటసాల రోడ్లు అభివృద్ధిపై కూడా ఎమ్మెల్యే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక్కడ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటు జరగడం లేదు. పార్టీలకు అతీతంగా పథకాలు ప్రజలకు అందుతున్నాయి. అయితే ఇక్కడ టీడీపీ తరుపున మండలి బుద్దప్రసాద్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఆయన 2014 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి అవనిగడ్డ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
మండలి ఓటమితో నియోజకవర్గంలో కొంత టీడీపీ కేడర్ వైఎస్సార్‌సీపీ వైపుకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కొందరు టీడీపీ నేతలు రమేష్ బాబుకు మద్ధతు ఇచ్చారు. దీంతో అవనిగడ్డలో రమేష్ బాబు, రోజురోజుకూ బలపడుతున్నారు. ఆయన పనితీరుతో ప్రజలని ఆకట్టుకోవడంతో, ఇక్కడ ప్రత్యర్ధులకు స్థానం లేకుండా పోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి