తాజాగా ఓ ప్రైవేట్ ఆసుపత్రి తీరు మరింత చర్చనీయాంశంగా విమర్శనాత్మకంగా మారిపోయింది. అయితే ఈ ప్రైవేట్ హాస్పటల్లో జరిగిన ఘటన కరోనా వైరస్ కు సంబంధించింది కాకపోయినప్పటికీ అంతకుమించి అనేంతలానే ప్రస్తుతం ఈ ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. చిన్నారికి ఆరోగ్య సమస్య రావడంతో తల్లిదండ్రులు ఎంతో కంగారు పడిపోయి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు భారీగా బిల్లు వేసింది. ఇక ఎంతో కష్టపడి ప్రైవేట్ హాస్పిటల్ బిల్లు కట్టిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం తల్లిదండ్రులకు గుండె పగిలే వార్త చెప్పింది..
అప్పటి వరకు తమ చిన్నారి కూతురు క్షేమంగా ఉంది అని చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం..బిల్లు కట్టిన వెంటనే కూతురు చావు వార్త విని పించి శవాన్ని అప్పగించిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది, అనంతపురం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. కరోనా బారినపడిన 12 ఏళ్ల చిన్నారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తల్లిదండ్రులు చేర్పించగా... బిల్లు కట్టేంతవరకు చిన్నారి ఆరోగ్యంగా ఉందంటూ వైద్యులు చెప్పుకొచ్చారు. బిల్లు కట్టగానే ఆ చిన్నారి చావు వార్త వినిపించి శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు వైద్యులు. అయితే వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి