ఇటీవల కాలంలో మనం చూసాం.. కొందరి సినీ ప్రముఖుల పేరు చెప్పుకొని, ఫలానా వారికి నేను మేనేజర్ అని, పిఎఅని చెప్పుకొని సినిమా ఛాన్సులు కోసం ఎదురు చూసే యువతి యువకులను బురిడీ కొట్టించారు. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ, సింగర్ సునీత, హీరో అల్లు అర్జున్ ఇలా కొంతమంది పేర్లు చెప్పి కొందరు ఆవారాగాళ్ళు ఎంతోమంది అమాయకులను మోసం చేసారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇక్కడ ఒకటి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పర్సనల్ సెక్రటరీనంటూ ప్రజలను నమ్మించి బురిడీ కొట్టించడానికి యత్నించిన యువకుడు కటకటాల వెనక్కి వెళ్ళాడు. తిమ్మాపూర్ మండలం పరిధిలో మొగిలి పాలెం గ్రామానికి చెందిన 'సాయి చందన్' అనే ఆవారాగాడు కరీంనగర్‌లోని విద్యానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కాగా.. వీడు గత కొంత కాలంగా, "కెసిఆర్ కుటుంబాల వ్యవహారాలను చక్కబెడతాను.. సీఎం అడిషినల్ సెక్రటరీగా పని చేస్తున్నాను.. అవినీతి నిరోధక విభాగం కింద కరీంనగర్ జిల్లా ఛైర్మన్‌గా చేస్తున్నాను." అని చెప్పుకుంటూ స్థానిక ప్రజలను కాష్ చేసుకుంటున్నాడు.
విషయం తెలిసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ క్రమంలో అనేక మోసాలు బయటపడ్డాయి. సీఎం కార్యాలయానికి చెందిన నకిలీ నియామకపు ఉత్తర్వులు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో దిగిన మార్పింగ్ ఫోటోలు, నకిలీ అవినీతి నిరోధక శాఖ ఛైర్మన్ గుర్తింపు కార్డులు చూసి పోలీసులు అవాక్కయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి