విషాదకర హైదరాబాద్లోని నేరేడ్మెట్ పరిధి లో చోటు చేసుకుంది. సాయి నగర్ లో ని కుమార్ అనే వ్యక్తి కుటుంబ నివాసం ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మధ్యాహ్న సమయం లో... ఎదురింటి భవనం పై ఎక్కి గాలిపటాన్ని ఎగరేచూస్తున్నాడు 12 ఏళ్ల కుమారుడు కీర్తన్. అయితే కొడుకు ఆడుకుంటున్నాడు కదా అని తల్లి దండ్రులు కూడా అంతగా పట్టించు కోలేదు. కానీ ఈ విషాదకర ఘటన జరుగుతుందని మాత్రం తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ఆ సమయంలో విద్యుత్ తీగల మధ్యలో గాలిపటం చిక్కుకుపోయింది. అక్కడ ఉన్న ప్రమాదాన్ని ఊహించలేకపోయాడు సదరు బాలుడు.. గాలిపటాన్ని అందుకునే ప్రయత్నం లో విద్యుత్ తీగలకు తగిలాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
గమనించిన స్థానికులు వెంటనే బాలున్ని ఆసుపత్రికి తరలించినప్పటికే ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. సదరు బాలున్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. అప్పుడు వరకు కళ్లెదుటే ఆడుకున్న కన్నబిడ్డ ఇకలేడు అన్న విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. విగతజీవిగా పడి ఉన్న బాలుడి మృతదేహంతో పై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల ఆవేదన చుట్టుపక్కల వారిని సైతం కంటతడి పెట్టించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి