భారీగా వరదల కారణంగా... కొన్ని కొన్ని ప్రాంతాలు గ్రామాలు సైతం పూర్తిగా జలదిగ్బంధంలో కి వెళ్ళి పోయాయి. దీంతో కరోనా వైరస్ తో పోరాడుతూనే మరోవైపు ప్రకృతి నుంచి కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంతోమంది పోరాడారు. ఇక ఆ తర్వాత వర్షాలు తగ్గడం తో ఇప్పుడిప్పుడే మొన్నటి వరదల్లో కలిగిన నష్టం నుంచి బయట పడుతున్నారు. కానీ ప్రస్తుతం మరోసారి కొన్ని ప్రాంతాల ప్రజలకు వర్షాల కారణంగా ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవలే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అందరికీ హెచ్చరికలు జారీ చేశారు.
ప్రకాశం జిల్లాలో అల్పపీడన పరిస్థితులపై అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని... లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మెరుగైన పారిశుద్ధ్యం ఉండే విధంగా చర్యలు చేపట్టాలి అంటూ ఆదేశించిన మంత్రి బాలినేని... ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో కరోనా వైరస్ విస్తరించకుండా తగిన చర్యలు చేపట్టాలి అంటూ తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ అంతరాయాలు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఆదేశాలు జారీ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి