
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల ప్రారంభం పై తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇటీవలే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇలా ఆన్లైన్ తరగతులు మాత్రం ప్రతి ఒక్కరికి అందడం లేదు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి పాఠశాలలు పునః ప్రారంభించేందుకు అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలను ప్రారంభించి ఎలాంటి నిబంధనలు పాఠశాలల్లో అమలు చేయాలి అనే దానిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది.
అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా పాఠశాలల పునఃప్రారంభం పై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 15 తర్వాత స్కూళ్ల పునఃప్రారంభం పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని ఇటీవల కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కూళ్ల పునఃప్రారంభం పై తెలంగాణ విద్యాశాఖ అధికారులు వచ్చే వారంలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా విద్యాసంస్థల ప్రారంభం కుదరకపోవచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతుంటే... ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 15 నుంచి పాఠశాలను పునఃప్రారంభం చేస్తారు అని మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.