కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రపంచ దేశాలు గజగజ వణికిపోయాయి. లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి ఇంట్లో బందీలు అయిన ప్రజలు ఇప్పుడిప్పుడే బయట ప్రపంచంలో తిరుగుతున్నారు. మరోవైపు కరోనాని ఖతం చేసే వ్యాక్సిన్లు అభివృద్ధి చెందడంతో పాటు... వాటిని పలు సంస్థలు అందుబాటులోకి తీసుకు రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదే తరహాలో భారత్ లో తయారైన కోవాగ్జిన్ కోవిషీల్డ్ లు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్ ను అభివృద్ధి పరిచిన పలు దేశాలు అత్యవసర నిమిత్తం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.

అదేవిధంగా మన భారతదేశం కూడా బ్రెజిల్ కు భారత్ కరోనా వ్యాక్సిన్ డోసులను పంపించింది. మొత్తం 20 లక్షల కొవిషీల్డ్ డోసులను అన్ని భద్రతల మధ్య ఎగుమతి చేయగా అవి బ్రెజిల్ కు చేరుకున్నాయి. వ్యాక్సిన్ డోస్ లను బ్రెజిల్ కు వాటిని సురక్షితంగా ఎగుమతి చేర్చినందుకు గాను ఆ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో భారత్ కు  ధన్యవాదాలు తెలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సహాయం చేస్తే కృతజ్ఞతలు తెలపడం సాధారణమైన విషయమే కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ? రామాయణ శైలిలో ధన్యవాదాలు తెలిపారు బ్రెజిల్ ప్రధాని....రామాయణంలో లక్ష్మణుడికి సంజీవని కోసం హనుమంతుడు సుమేరు పర్వతాన్ని ఒంటిచేత్తో ఎత్తుకొచ్చినట్లు... బ్రెజిల్ కు కూడా హనుమంతుడు గాల్లో ఎగురుతూ వ్యాక్సిన్లు తీసుకెళ్తున్నట్లుగా ఓ ఫోటోను జైర్ బోల్సోనారో తన ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేసి దానిపై ధన్యవాద్ భారత్ అని రాశారు.

ఈ రేంజ్ లో ధన్యవాదాలు తెలపడం అంటే నిజంగా స్పెషలే. అంతేకాదు... నమస్కారం ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యను అధిగమించే ప్రయత్నాల్లో ఓ గొప్ప భాగస్వామిని కలిగి ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నాం. భారత్ నుంచి మాకు వ్యాక్సిన్లు తరలించి.. మాకు ఇంత పెద్ద సాయం చేసినందుకు కృతజ్ఞతలు. ధన్యవాద్ భారత్’’ అని  ట్వీట్ లో పేర్కొన్నారు బ్రెజిల్ ప్రధాని. ఇందుకు స్పందించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ..ఆ గౌరవం తమదన్నారు. 'కరోనా మహమ్మారి  యుద్ధంలో బ్రెజిల్ వంటి దేశానికి నమ్మకమైన భాగస్వామిగా ఉన్నందుకు ఆ గౌరవం మాది. ఆరోగ్య రంగంలో పరస్పర సహకారాన్ని మరింత దృఢం చేసుకుందాం' ఎల్లవేళల సన్నిహిత దేశాలుగా మెలుగుదాం అంటూ రీట్వీట్ చేశారు. ఇకపోతే...మాల్దీవులు సౌదీ అరేబియా సౌతాఫ్రికా నేపాల్ మరియు భూటాన్ దేశాలకు కూడా భారత్ నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి కానున్నాయి. కరోనా సమరంలో ప్రపంచ దేశాల ప్రజల ప్రాణాలను రక్షించడంలో భారత భాగమైనందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారుభారతీయులు.

మరింత సమాచారం తెలుసుకోండి: