తెలంగాణ రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి దీంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమై పోతోంది. అయితే గ్రామాలు పట్టణాలు నగరాలు అనే తేడా లేకుండా పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోతున్నాయి. వర్షాలతో లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది అతలాకుతలం అయిపోతున్నాయి. అధికారులు ఎన్ని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ భారీ వర్షాలు సృష్టించిన విధ్వంసాన్ని మాత్రం అదుపులోకి తీసుకు రాలేకపోతున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా మరోసారి  భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



 వాన నీటితో మరోసారి రైతు కంట నీరు  తప్పలేదు. ఎందుకంటే ఈ ఏడాది వర్షాకాలం భారీగా వర్షాలు కురవడంతో ఎంతో మురిసిపోయిన రైతన్న... ఈ సారైనా గత ఏడాది పంట కోసం చేసిన అప్పులు తీర్చాలి అని అనుకొని భారీగా పంట వేశాడు. రైతన్న ఊహించినట్లుగానే భారీగా పంటలు కూడా వచ్చాయి. ఇక వర్షాకాలం ముగిసింది కదా పంట చేతికి వచ్చింది ఇక మిగిలింది.. పంట కోతే. ఇక ఈ సారి అప్పులు తీరి పోతాయి అని అనుకున్నాడు రైతన్న. కానీ వర్షపు  నీరు మరోసారి రైతన్నకు కంట కన్నీరే మిగిల్చింది. వానలు పడక పంటలో  చుక్క నీరు లేక పంటలు ఎండిపోయి కంట నీరు పెట్టుకున్న రైతన్న.. ఈసారి అతివృష్టి కారణంగా భారీ వర్షాలు కురిసి చేతికి వచ్చిన పంట నీట మునిగిపోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు.


 బాగా పండిన పంట తో అప్పులు తీర్చుకోవాలి అనుకున్న రైతన్నకు ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. భారీగా కురుస్తున్న వర్షాలతో రైతన్నకు కన్నీటి వ్యథ మిగిలిపోయింది. ఈ వర్షాకాలంలో కురిసిన వర్షాలతో ఆ దేవుడు రైతన్నల కష్టాలు తీర్చడానికి కరుణించాడు అనిపించినప్పటికీ ప్రస్తుతం పంట చేతికి వచ్చిన సమయంలో భారీగా కురుస్తున్న వర్షాలతో ఆ దేవుడికి రైతన్నపై కనికరం లేదు అన్నది అర్థం అవుతుంది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు రైతన్న.

మరింత సమాచారం తెలుసుకోండి: