భారత్-చైనా సరిహద్దుల్లో  ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే త్వరలో భారత్-చైనా మధ్య యుద్ధం తప్పదు అనే విధంగానే ఉంది పరిస్థితి. ఒప్పందాలు జరిగినప్పటికీ సరిహద్దుల్లో మోహరింపులు  మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనాను దీటుగా ఎదుర్కొని ఓడించేందుకు భారత్ క్రమక్రమంగా ఎంతో పటిష్టంగా మారిపోతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా చైనాతో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా భారత్ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నాయి.




 అయితే భారత్ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ చైనా మాత్రం ఎప్పుడూ సరిహద్దుల్లో నిర్లక్ష్య ధోరణితో విస్తరణ వాద కాంక్ష తో రగిలి పోతూ దుందుడుకుగా వ్యవహరిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంకండి అంటూ తమ దేశ సైన్యానికి పిలుపునివ్వడం మరింత సంచలనం గా మారిపోయింది. ఇక ఇప్పటికే చైనా ఎన్నో దేశాలతో వివాదాల పెట్టుకున్న నేపథ్యంలో ఏ దేశంతో యుద్ధం చేయడానికి సిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.



 ఇదిలా ఉంటే ఇటీవలే భారత్ చైనా కు స్ట్రాంగ్  వార్నింగ్ ఇచ్చింది... లడక్ అరుణాచల్ ప్రదేశ్ పై ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చైనా పై కన్నెర్ర జేసిన భారత్ దీటుగా బదులిస్తూ వార్నింగ్ ఇచ్చింది. భారత అంతర్గత వ్యవహారాల పై వ్యాఖ్యానించడానికి చైనా కు ఎలాంటి అధికారం లేదు అంటూ భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ లడక్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు భారతదేశంలోని అంతర్భాగాలు అంటూ నొక్కి చెప్పిన భారత విదేశాంగ శాఖ... ఆ భూభాగాల  విషయాల్లో జోక్యం చేసుకోకు అంటూ చైనా కు వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి శ్రీవాస్తవ చైనా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: