పానీపూరి అంటే చాలా మందికి ప్రాణం అనే చెప్పాలి. దానిని ఇష్టపడని వారు చాలా అరుదు.  ఇది ఎంతో మందికి నచ్చే చిరుతిండి. అయితే పానీపూరి గురించి మీకు తెలియని ఎన్నో విషయాన్ని ఇప్పుడే తెలుసుకోండి.  పానీపూరి  భారతదేశం అంతటా దొరుకుతుంది.  గోల్ గుప్పే, పుచ్చా, గుప్ చుప్ ఇలా  మొదలైన పేర్లతో దీనిని పిలుస్తారు. ఇది ఇలా ఉండగా ఈ పానీ పూరీని కొందరు ఇది ఆరోగ్యానికి హానికరం అని, మరికొందరు ఇది ఆరోగ్యకరమైనదని అంటున్నారు. అయితే మరి ఇది ఆరోగ్యకరమైనది  కాదా.....? ఈ విషయం లోకి వస్తే......

పానీపూరి లో పూరి సెమోలినా మరియు మైదా పిండి తో తయారు చేస్తారు.  ఇందులో ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఇ, కాల్షియం మరియు మెగ్నీషియంలు ఉన్నాయి గుర్తుంచుకోండి. కాబట్టి పూరి మంచిదే. మరి మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు దీనిని తినవచ్చా? లేదా...? ఈ విషయం లోకి వస్తే....పానిపురిని తయారు చేసే పద్ధతి చాలా అనారోగ్యంగా ఉంటుంది. అయితే, మీరు బరువు తగ్గాలంటే, మీరు అప్పుడప్పుడు తీసుకోవచ్చు.

బరువు తగ్గాలనుకునే వారు మీరు తీపి / పుల్లని నీరు లేకుండా బంగాళదుంప మరియు బఠానీలు లేకుండా తినవచ్చు. కాబట్టి ఇలా ఇవి లేకుండా తినొచ్చు. అలానే దీనిని  సాయంత్రం తినే బదులు మధ్యాహ్నం మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం మరియు  రాత్రి సమయంలో  కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేట్లు చూసుకోండి మంచిది. మీరు కనుక ఆరోగ్యకరమైన పానీపూరీని తీసుకోవాలంటే పూరిలో స్ప్రౌట్స్ వగైరా వేసుకుని తింటే కూడా మంచిదే. ఏది ఏమైనా పానీ పూరి కన్పిస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. చిన్న పిల్లల నుండి అందరు కూడా పానీపూరి ని బాగా ఇష్ట పడతారు. ఇలా పానీపూరి ఎన్ని సార్లు తిన్న బోర్ ఏ మాత్రం కొట్టదు.


మరింత సమాచారం తెలుసుకోండి: