కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి గత రెండు మూడు రోజుల నుంచి హైదరాబాదులో పర్యటిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయన ప్రజల నుంచి సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి కూడా హైదరాబాదులో ఉన్న వాస్తవ పరిస్థితులను ఆయన వివరిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా కు ఆయన హైదరాబాదులో ఉన్న వాస్తవ పరిస్థితిని వివరించినట్లుగా తెలుస్తోంది.

వారికి హైదరాబాద్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆయన వీడియోలతో సహా పంపించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి విషయంలో కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో కూడా విమర్శలు వస్తున్నాయి. ఆయన హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సమయంలో స్థానిక ఎమ్మార్వో గానీ అధికారులు గానీ ఎవరూ కూడా రాలేదు. అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఆయన వెంట లేరు. దీంతో ఇప్పుడు కిషన్ రెడ్డి కాస్త సీరియస్గా ఉన్నారు. దీనితో జిహెచ్ఎంసి కమిషనర్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

కనీసం తను వస్తే అధికారులు వచ్చి అసలు పరిస్థితిని తనకు వివరించడానికి కూడా ఇష్టం పడలేదని దీంతో తనకు వరద గురించి కేంద్రానికి చెప్పాలి అంటే అసలు వివరాలు ఏవిధంగా తెలుస్తాయని తాను స్వయంగా పరిశీలిస్తున్న అధికారులు రాలేదు అంటే వారి ఆలోచనా విధానం ఏ విధంగా ఉందని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. వారి వెనుక ఎవరు ఉన్నారు అని ఆయన నిలదీస్తున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఆయన రాష్ట్ర అధికారులపై విమర్శలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోం శాఖకు ఆయన ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండవచ్చు. సాధారణంగా కేంద్రమంత్రి వస్తే ప్రోటోకాల్ ప్రకారం అయినా అధికారులు రావాల్సి ఉంటుంది అయినా సరే జిహెచ్ఎంసి అధికారులు మాత్రం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: