హైదరాబాదులో వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. వర్షం తగ్గిపోయింది అనుకుని ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షం భారీగా పడటంతో ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో మళ్లీ భారీగా వరదలు వచ్చాయి. దీంతో ఉద్యోగులు కూడా నానా అవస్థలు పడుతున్నారు. ఇక హైదరాబాద్ లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అనే వార్తల నేపథ్యంలో చాలా మంది హైదరాబాద్ నీకు ఖాళీ చేసి వెళ్లిపోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే వర్షాల దెబ్బకు కొంత మంది ఆర్థికంగా కూడా నష్టపోయారు. వ్యక్తిగత వాహనాలు అదేవిధంగా నివాసాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఉద్యోగులు కొంత మంది ఉద్యోగాలకు రాజీనామా చేసి హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వ్యాపారాలు దెబ్బతిన్న వారు కూడా ఇప్పుడు హైదరాబాదులో ఉండటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రాత్రి పడిన వారి వర్షానికి హైదరాబాదులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మెట్రో స్టేషన్ల వద్ద కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బస్టాండ్ వద్ద కూడా అసలు ప్రజలు నిలబడే పరిస్థితి కనబడటం లేదు.

ఇక వాహనదారులు అయితే రోడ్ల మీద వెళ్ళాలి అంటే నరకం చూస్తున్నారు. దీనితో హైదరాబాదులో ఉండటం కంటే ఇంటికి వచ్చేయడమే మంచిది అని భావిస్తున్న చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లి పోతున్నారు. త్వరలో దసరా కూడా ఉన్న నేపథ్యంలో పరిస్థితి మెరుగు పెడితే తర్వాత హైదరాబాద్ వెళ్ళాలి అని భావిస్తున్నారు కొంతమంది. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అల్పపీడనం కూడా అరేబియా మహా సముద్రంలో ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 19 తర్వాత మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉండవచ్చు అని చెప్పడంతో హైదరాబాదులో ఉండాలంటే కంగారు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: