డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. పండుగల నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉంటే కరోనాను కట్టడి చేసిన వాళ్ళమవుతాం అని అన్నారు. నాలుగు రకాల జాగ్రత్తలతో బతుకమ్మను జరుపుకోండి అన్నారు. గాంధీలో ప్రస్తుతం350 కేసులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ కు ఇంకా 3..4 నెలలు సమయం పట్టొచ్చని చెప్పారు. వరదల రిహాబిలిటేషన్ సెంటర్లో ను టెస్టులు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ఆసుపత్రులను అలెర్ట్ చేశామని పేర్కొన్నారు.

వరదల సమయాల్లో గాయ పడ్డవారు దగ్గర ఉన్న హాస్పిటల్ కు వెళ్ళండని సూచించారు. పాము కాట్లకు గురైన వారు సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండని పేర్కొన్నారు. 104 కు కాల్ చేయమని చెప్పారు. చలి..వాన వల్ల వచ్చే వ్యాధుల లక్షణాలు ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోండని సూచించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్. శ్రీనివాస్  మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కరోన నియంత్రణలో ఉందన్నారు. కరోనా రికవరీ రేట్ 90 శాతం ఉందని చెప్పారు. ప్రతి 10 లక్షల మందిలో లక్షమందికి పైగా పరిక్షలు  చేశామని అన్నారు.

35 లక్షలు కు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించామని న్నారు. నీళ్లు ..ఆహారం..దోమల ద్వారా వచ్చే అంటువ్యాధులపై  సమీక్ష నిర్వహించామని వివరించారు. జీహెచ్ఎంసీ లో 182 వైద్య శిబిరాలు నిర్వహించామని చెప్పారు. రిలీఫ్ సెంటర్లలో 2వేలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించామని వివరించారు. రిలీఫ్ క్యామ్ప్ ల్లో ఉన్న వారికి మాస్కులు.. సానిటైజర్ లు అందించామని అన్నారు. 167 వాహనాల ద్వారా జీ హెచ్ఎమ్సీ లో మొబైల్ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు. తాగే నీరును వేడి చేయండి...వేడి ఆహారాన్ని తీసుకోండని  తెలిపారు. ఎలాంటి ఇబ్బందులున్న 104 కు కాల్ చేయండని పేర్కొన్నారు. బస్తీ దావాఖానాలను అవసరమైతే 24 గంటలు ఓపెన్ చెయ్యమని ఆదేశించామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: