రోజులో మనం అనేక పనులని చేస్తుంటాం. అప్పుడు మనం బాగా అలసిపోతాం. ఇలా  అలసిన శరీరానికి విశ్రాంతినివ్వడానికి రాత్రి నిద్ర బాగా సహాయం చేస్తుంది. కానీ చాలా మందికి  సరిగ్గా నిద్ర పట్టదు. ఇలా వాళ్ళు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ నిద్ర లేమి కారణంగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.  వీటికి గల  కారణాలు చాలానే ఉన్నాయి.  పని ఒత్తిడి కావొచ్చు, అధిక ఆలోచనా కావొచ్చు….ఇలా అనేక కారణాల ఉన్నాయి.

ప్రతీ ఒక్కరు  రోజుకు  మామూలుగా 8 నుంచి 6 గంటలైనా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగని 8 గంటలు కంటే ఎక్కువగా కూడా  నిద్రపోవచ్చని తెలుపుతున్నారు. అయితే  సరిగ్గా 6 గంటలు కూడా నిద్రపోని వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్సోమ్నియా, నార్కోలెప్సీ వంటి స్లీపింగ్ డిసార్డర్స్ ని రికగ్నైజ్ చేయడం తేలిక, కాని స్లీప్ యాప్నియా వంటి చాలా మందికి తెలియని వాటిని గుర్తించడం చాలా కష్టమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మరి స్లీప్ యాప్నియా అంటే ఏమిటి...? ఈ విషయం లోకి వస్తే..

స్లీప్ యాప్నియా  ఒక బ్రీథింగ్ వ్యాధి. ఈ స్లీప్ యాప్నియా వల్ల టిష్యూలకి కావాల్సిన ఆక్సిజన్ లభించదు. దీనివల్ల నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురౌతాయి. గొంతులో ఉన్నమజిల్స్ ఓవర్ రిలాక్సేషన్ వల్ల ఇలా జరుగుతుంటుందని నిపుణులు తెలుపుతున్నారు. దీని మూలంగానే  రాత్రుళ్లు సరైన నిద్ర లేక మార్నింగ్ టైం లో తలపోటు, నీరసం, డిప్రెషన్ వంటివి కూడా కలగవచ్చని అంటున్నారు నిపుణులు. ఈ నిద్ర లేమి సమస్య పెరుగుతునన కొద్ది బ్రెయిన్ సామర్థాన్ని కూడా వినియోగించుకోలేరని తెలుస్తోంది. ఇది ఉన్న వారికి ఆలోచనా శక్తి, పనిచేసే సామర్థ్యం తగ్గిపోతూ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఈ స్లీప్ యాప్నియా పేద కుటుంబాల్లో ఉన్న వారికి వస్తుందట. స్లీప్ యాప్నియా లక్షణాలతో బాధపడే వారు త్వరితగతినా డాక్టర్ ను కలిసి స్లీప్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.  అప్పుడు ఈ సమస్య నుండి బయటపడొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: