దసరా పండుగ హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల లో ఒకటి. ఈ పండుగని ఏకంగా తొమ్మిది రోజుల పాటు జరుపుతారు. తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యేక విధానం కలిగి ఉంది. ప్రతీ ఏటా ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారికి పూజలు చెయ్యడం ఆనవాయితి. ఈ నవ రాత్రులు కూడా  దీపం వెలిగించడం, దేవి అర్చన చేయడం, లలితా సహస్ర నామాలు , దుర్గా సప్తశతి పారాయణ మొదలైనవి చేస్తూ ఉంటారు భక్తులు.

ఇలా కనుక అనుసరిస్తే కోరుకున్నవి  నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అలానే ప్రతీ రోజు అమ్మవారికి అలంకారాలు చేస్తారు.  అయితే ఈ ఏడాదికి ఇప్పటికే రెండు రోజులు అయిపోయాయి. ఇది మూడవ రోజు. మరి మూడవ రోజు ఏం చేస్తారు..? ఈ విషయం లోకి వస్తే.... ఈ రోజు గాయత్రి రూపం తో అలంకరిస్తారు.  గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ , హృదయం లో విష్ణువు, శిఖ లో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సూర్య భగవానుడు గాయత్రీ మంత్రాని కి అధిష్టాన దేవతగా భాసిల్లు తున్నాడు. అన్ని ఆలయాల్లో కూడా ఇలానే తయారు చేస్తారు.

బెజవాడ దుర్గ గుడి లో కూడా  మూడో రోజున అమ్మ వారు గాయత్రీ దేవి రూపం లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. చాలా మంది తమ ఇళ్లల్లో కూడా అమ్మవారిని పెట్టి రోజుకో రూపం లో అలంకరిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా , వేద మాతగా ప్రసిద్ది పొందిన ''ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాల''తో ప్రకాశించే పంచముఖాల తో గాయత్రీ దేవి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటారు. గాయత్రీ మాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.
  

మరింత సమాచారం తెలుసుకోండి: