తెలుగుదేశం పార్టీ పుట్టుక ఒక చరిత్ర ఉంది. పార్టీ గెలవడం కూడా ఒక చరిత్ర. ఒక ప్రాంతీయ పార్టీ ఇన్నాళ్ళు మనగలగడం కూడా ఇంకొక చరిత్ర. ఇలా ఎన్నో చరిత్రలను టీడీపీ సృష్టించింది. ఇంకా చెప్పాలంటే గత ఏడాది ఎన్నికల్లో ఘోర పరాభవం పాలు కావడం కూడా  టీడీపీ చరిత్రలో మరో అధ్యాయం. ఏది ఏమైనా టీడీపీని పెట్టిన వారు మహానుభావుడు. ప్రజల చేత దైవాంశ సంభూతుడు అని పిలిపించుకున్న అన్న ఎన్టీయార్ ఈ పార్టీని స్థాపించారు. మరి ఆయన వారసులకు టీడీపీలో ఏమైనా పాత్ర ఉందా అంటే అసంతృప్తి సమాధానమే వస్తుంది.

ఎన్టీయార్ కి కుమారులు ఉన్నారు. వారిలో రాజకీయంగా హరిక్రిష్ణ మొదట్లో చురుకుగా ఉండేవారు. 2014 ఎన్నికలకు ముందు బాలక్రిష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురం నుంచి ఆయన గెలిచారు. అయినా మంత్రి పదవి దక్కలేదు. ఎక్కడా గెలవని లోకేష్ కి మంత్రి అయిదు కీలకమైన శాఖలతో మంత్రి పదవిని ఆ తరువాత చంద్రబాబు కట్టబెట్టారు. ఇక రెండవమారు కూడా బాలయ్య జగన్ వేవ్ ని సైతం తట్టుకుని గెలిచారు. తొలిసారి మంగళగరిలో పోటీ చేసిన లోకేష్ ఓటమిపాలు అయ్యారు.


అయినా పార్టీ పదవుల్లో లోకేష్ కి పెద్ద పీట వేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్ళకు, ఇంకా చెప్పాలంటే ఇన్నేళ్ళకు బాలయ్యకు పొలిట్ బ్యూర్లోలో మెంబర్ షిప్ దక్కింది. నిజానికి నాన్న పెట్టిన పార్టీలో ఆయనే ముందుండాలి. ఆయనే అందరినీ నడిపించాలి. ఆయనే అగ్ర తాంబూలం అందుకోవాలి కానీ పాతిక మంది పొలిట్  బ్యూరో సభ్యులలో ఒకరిగా ఆయన్ని బాబు నియమించడం అంటే న్యాయం జరిగినట్లా కాదా అన్నది అభిమానులే నిర్ణయించుకోవాలి.  ఏది ఏమైనా తండ్రికి సినీ రంగాన సిసలైన వారసుడిగా రాణించిన బాలయ్య రాజకీయాల్లో మాత్రం బావ చాటున ఉండిపోవడం ఆయన ఫ్యాన్స్ కి బాధ కలిగించే పరిణామమే.

మరింత సమాచారం తెలుసుకోండి: