బెంగళూరు పోలీసులు ఒక దొంగను పట్టుకోవడానికి ఏకంగా విమానం లోనే వెంబడించారు. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుంటే బుర్ద్వాన్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన కైలాష్ దాస్ బెంగళూరులో పని చేస్తున్నాడు. ఐతే అతను తాజాగా 1.3 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను అపహరించి రైలులో పారిపోయాడు.  అతను బెంగళూరులోని ఒక బిల్డర్ ఇంట్లో పని మనిషి గా పని చేస్తున్నాడు. యజమానులు డబ్బులు ఎక్కడ దాస్తారో, ఎక్కడ దాచి పెడతారో మొత్తం తెలిసిన ఈ పనిమనిషి కైలాష్ దాస్ 1.3 కోట్ల రూపాయల విలువైన వజ్రాలను దొంగిలించి కోల్‌కత్తాకు పారిపోయాడు.


అక్టోబర్ మొదటి వారంలో బిల్డర్ యొక్క కుటుంబ సభ్యుడు కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయం కైలాష్ కి కూడా తెలిసింది. దీంతో ఇంట్లోనే కింద ఫ్లోర్ లో పని చేస్తున్న పని మనిషి దాస్ యజమానులు తమ కుటుంబ సభ్యుడి బాగోగులు చూసుకోవటం లో నిమగ్నం అవడంతో ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కరోనా బాధితుడి బాగోగులు చూసుకోవడంలో కుటుంబం బిజీగా ఉండగా.. అదే అదనుగా భావించి అక్టోబర్ 9న దాస్ రూ. 1.3 కోట్ల విలువైన డైమండ్ నగలు దాచిపెట్టిన ఎలక్ట్రానిక్ లాకర్‌ ను దొంగిలించాడు. ఎలక్ట్రానిక్ లాకర్‌తో దాస్ కోల్‌కత్తాకు వెళ్లే ట్రైన్ ఎక్కాడని పోలీసులకు తెలిసింది. బిల్డర్ నుండి ఫిర్యాదు వచ్చిన వెంటనే బెంగళూరు పోలీసులు ఈ కేసును విచారించి దాస్‌ను దొంగ అని తేల్చారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే, యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ లో కైలాష్ దాస్ రైలు ఎక్కే దృశ్యాలను పోలీసులు కనుగొన్నారు.


ఈ భారీ దొంగతనం కేసులో పోలీసులు చాలా వేగంగా స్పందించి దాస్‌ను పట్టుకోవటానికి కోల్‌కతాకు వెళ్లే విమానం ఎక్కారు. పోలీసులను చూసి దాస్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ వెంబడించి పట్టుకొని బెంగళూరు పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: