అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున రాజధాని ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో ఉన్న రైతులు రాజధాని ప్రాంతానికి శంకుస్థాపన చేసి  5 ఏళ్ళు అయిన సందర్భంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఇక అమరావతికి మద్దతుగా అక్కడికి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చారు. అమరావతి కి మద్దతుగా గుంటూరు నుంచి ఉద్దండ రాయని పాలెం గ్రామం వరకు పాదయాత్ర చేసారు రైతులు, మహిళలు. వారికి మద్దతుగా సభలో పాల్గొని మాట్లాడిన ఎంపి గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా ఆయన ఎక్కువగా విమర్శలు చేసారు. అంతే కాకుండా చంద్రబాబు నాయుడు చేసిన కృషిని కూడా ప్రస్తావించారు. అమరావతి ని ఆదర్శ రాజధానిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు తపించారు అని ఆయన చెప్పుకొచ్చారు. పంచం మొత్తం తిరిగి.. పరిశీలించి.. ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. రైతులు మన రాష్ట్రం అనే భావనతో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు అని ఆయన అన్నారు. ముందు చూపు లేని జగన్మోహన్ రెడ్డి అమరావతి ని చంపాలని కుట్రలు చేశారు అని ఆయన తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టినందుకు మా కుటుంబం పై ప్రభుత్వం కక్ష కట్టింది అని ఆయన ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అయినా వెనుకడుగు‌ వేయకుండా మేము పోరాడుతున్నాం అని ఆయన చెప్పారు. 310 రోజులుగా ఇంతమంది మహిళలు చేస్తున్న పోరాటమే మాకు ఆదర్శం అని గల్లా చెప్పుకొచ్చారు. అమరావతి ని ఎవరూ మార్చలేరు అని ఆయన స్పష్టం చేసారు. రాజధానిగా కొనసాగుతుంది అని ధీమా వ్యక్తం చేసారు. అయితే ప్రభుత్వం చేసే కుట్ర లను ఎదుర్కొనేలా మన పోరాటం కొనసాగించాలి అని ఆయన పిలుపునిచ్చారు. న్యాయం, ధర్మం మన పక్షాన ఉంది.. న్యాయ స్థానంలో అయినా విజయం సాధిస్తాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: