గల్లా జయదేవ్‌ కేంద్రంలోని పెద్దలతో టచ్‌లో ఉన్నారా? అంటే గత కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కాస్త అవునేమో అని అనుమానం రాక మానదు. గల్లా ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జయదేవ్..తన తల్లి అరుణ కుమారితో కలిసి 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఇక ఆ ఎన్నికల్లో జయదేవ్ గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. స్వతహాగా బిజినెస్‌మ్యాన్ అయిన గల్లాకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మంచి పరిచయాలే ఏర్పడ్డాయి.

ఇక అప్పటి నుంచి గల్లా కాస్త ఆచితూచి నడుస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలోనే 2019లో జరిగిన ఎన్నికల్లో గల్లా మరోసారి ఎంపీగా గెలిచారు. రాష్ట్రంలో జగన్ గాలి ఉన్నా సరే గల్లా మాత్రం టీడీపీ నుంచి గెలిచారు. అయితే టీడీపీ అధికారంలో లేకపోవడంతో, గల్లా పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరుగుతూనే ఉంది. అటు ఆయన తల్లి అరుణ కుమారి సైతం ఇటీవల పొలిట్‌బ్యూరో నుంచి తప్పుకున్నారు. అలాగే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి ఇచ్చినా యాక్టివ్‌గా లేరు.

దీంతో గల్లా ఫ్యామిలీ జంపింగ్ ఖాయమని, బీజేపీలోకి వెళ్తారని వార్తలు వస్తున్నాయి. అయితే వారు మాత్రం పార్టీ మారడం లేదు. జయదేవ్ టీడీపీలో యాక్టివ్‌గానే ఉంటున్నారు. అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ మీద ఎలాంటి విమర్శలు చేయడం లేదు. పైగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలని పరిశీలిస్తే కాస్త అనుమానం కలిగిస్తున్నాయి.

2022లో జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సంచలన కామెంట్స్ చేశారు. అయితే జమిలి ఎన్నికలు జరుగుతాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. దీని గురించి చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటున్నారు. కానీ గల్లా ఇంత పెద్ద స్టేట్‌మెంట్స్ ఎప్పుడు ఇవ్వరు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఎవరో కేంద్ర పెద్దలు జమిలి ఎన్నికలు గురించి గల్లాకు లీక్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే గల్లా అంతా కాన్ఫిడెంట్‌గా జమిలి ఎన్నికలపై స్టేట్‌మెంట్ ఇచ్చారని విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: