జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాక విశాఖపట్నంలో టీడీపీకి కష్టకాలం మొదలైన విషయం తెలిసిందే. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానుండటం, టీడీపీ ఏమో అమరావతికే మద్ధతు తెలపడంతో విశాఖలో టీడీపీకి భారీ దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖలో పలువురు నేతలు టీడీపీని వీడారు. ఇటీవల విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ సైతం టీడీపీని వీడి వైసీపీ వైపుకు వచ్చారు.

అటు నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీని వీడటం ఖాయమని తెలుస్తోంది. దీంతో విశాఖలో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. ఈ తరుణంలోనే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. అందులో భాగంగానే విశాఖ, అనకాపల్లి, అరకు పార్లమెంట్ స్థానాలకు అధ్యక్షులని పెట్టారు. వారు ఇప్పుడుప్పుడే పార్టీని యాక్టివ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తిరుగుతూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే సమయంలో బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ సైతం యాక్టివ్ అయ్యాడు. 2019 ఎన్నికల్లో భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం 4 వేల ఓట్ల తేడాతోనే భరత్ ఓటమి పాలయ్యారు.

అయితే ఓడిపోయాక భరత్ పార్టీలో పెద్దగా కనిపించలేదు. కానీ ఇటీవల వాసుపల్లి పార్టీని వీడటంతో భరత్ రంగంలోకి దిగారు. తాజాగా విశాఖ సౌత్ నియోజకవర్గంలో పర్యటించి నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా పనిచేయడం మొదలుపెట్టారు. దీంతో సౌత్ కేడర్‌లో కాస్త ధైర్యం కూడా వచ్చింది. ఇదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో భరత్ సౌత్ నుంచి పోటీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని టాక్. విశాఖ పార్లమెంట్ బరిలో సబ్బం హరి దిగితే, భరత్ సౌత్ లో దిగొచ్చని అంటున్నారు. మొత్తానికైతే భరత్ పార్టీ కోసం రంగంలోకి దిగి, విశాఖలో పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి భరత్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: