bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కొత్త క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్లను ప్రవేశపెట్టకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న యూపీఐ క్యూఆర్, భారత్ క్యూఆర్ కోడ్లు మాత్రమే కొనసాగుతాయని, కొత్త క్యూఆర్ కోడ్లకు అనుమతి లేదని ఆర్బీఐ పేర్కొంది.

డిజిటల్ చెల్లింపుల కోసం పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ (పీఎస్ఓ) పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కోసం కొత్త క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టొదంటూ ఆర్బీఐ వెల్లడించింది. సొంతంగా క్యూఆర్ కోడ్లు వాడుకుంటున్న పీఎస్ఓ సంస్థలు భారత క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ క్యూఆర్ కోడ్ కు మారాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా పీఎస్ఓ సంస్థలు ఈ రెండింటికీ మారాలని తెలిపింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత్, యూపీఐ క్యూఆర్ కోడ్లతో పాటు పలు సంస్థలు సొంత కోడ్ లను వాడుతున్నారు. ఈ క్యూఆర్ కోడ్లు రెండు డైమెన్షనల్ మిషన్, రీడబుల్ బార్ కోడ్స్ ఆధారంగా పని చేస్తున్నాయి. పాయింట్ ఆఫ్ సేల్ వద్ద మొబైల్ చెల్లింపులు సులభతరం చేయడానికి ఈ క్యూఆర్ కోడ్లను ఉపయోగిస్తారు. ఈ క్యూఆర్ కోడ్ సాయంతో పెద్ద మొత్తంలో సమాచారం నిల్వ చేసుకోగలము. అయితే క్యూఆర్ కోడ్ వ్యవస్థను సమీక్షించేందుకు దీపక్ పాటక్ ఆధ్వర్యంలో ఆర్బీఐ ప్రముఖులు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో కమిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుతం ఉన్న రెండు క్యూఆర్ కోడ్లు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ చెల్లింపులు సులభతరం చేసేందుకు ఈ నిర్ణం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం వినియోగదారులు ఆన్ లైన్ పేమెంట్లకే మక్కువ చూపుతున్నారు. పేమెంట్స్ ఈజీగా, స్పీడ్ గా అయ్యేందుకు పలు సంస్థలు క్యూఆర్ కోడ్లను వాడుతుంటారు. ఈజీగా మనీ పే చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ లు ఉపయోగపడుతాయి. దీంతో కస్టమర్లు తమ లావాదేవీలు సులభతరం చేసుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: