శనివారం ఉదయం నుంచే ఓ బ్రేకింగ్ న్యూస్ పలకరించింది. అది విశాఖ గీతం యూనివర్శిటీలో అక్రమ కట్టడాలను విశాఖ అధికారులు కూల్చివేస్తున్నారన్నది ఆ బ్రేకింగ్ న్యూస్ సారాంశం. ఈ విశాఖ గీతం యూనివర్శిటీ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కు చెందినదన్నది జగమెరిగిన సత్యమే. అయితే ఆ యూనివర్శిటీ దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేసిందట. ఈ మేరకు ఆరు నెలల క్రితమే నోటీసులు ఇచ్చారట.

ప్రభుత్వ భూముల కబ్జా గురించి ఆరు నెలల క్రితమే రెవెన్యూ అధికారులు ఆ యూనివర్శిటీతో సంప్రదించారట. అక్రమ స్థలాలను సర్వే చేసి మార్కింగ్ కూడా చేశారట. అయినప్పటికీ ఫలితం లేక ఇక ఏకంగా కూల్చివేతలకు దిగారు.  ఈ విషయాలన్నీ ఆర్డీవో మీడియాకు చెప్పారు. అయితే.. ఈ వార్తను ఇవ్వడంలో బాబోరి అనుకూల మీడియా తన చాకచక్యం ప్రదర్శించింది. ఎక్కడా అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూముల కబ్జా అన్న పదాలు రాకుండా.. ఓ సరస్వతీ నిలయాన్ని ఈ దుర్మార్గ జగన్ సర్కారు కూల్చివేస్తున్నదన్న రేంజ్‌లోనే రాసుకొచ్చారు.

ఆ పదాల మాయాజాలం చూడండి.. ఓ పత్రిక  గీతం విశ్వవిద్యాల‌య నిర్మాణాల కూల్చివేత‌ అనే శీర్షిక‌తో వార్త రాసింది.  ఇది చదివితే.. జ‌గ‌న్ స‌ర్కార్ అన్యాయంగా టీడీపీ నేత‌కు సంబంధించిన విశ్వవిద్యాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌కు పాల్పడుతోంద‌నే భావ‌న క‌లుగుతుంది. ఇలాంటి నెగెటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ అయ్యేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడా నిర్మాణాల‌కు ముందు అక్రమ అని రాయలేదు. అయితే అదే వార్తలో ఆర్డీవో వివరణ కూడా ఇచ్చారు.

ఆ రెండు పత్రికలు ఇదే ధోరణి అనుసరించాయి. అంతేకాదు.. గతంలో గీతం ఎన్ని సేవలు అందించింది. కొవిడ్ సమయంలో ఎన్ని సేవలు చేసుకొ‌చ్చిందీ రాశాయి. అంతే తప్ప.. ఎక్కడా 40 ఎకరాలు అక్రమంగా ఆక్రమించేసిందని.. దాని మార్కెట్ విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు ఉంటుందని మాత్రం రాయలేదు.  ఇక ఈ ఘటనపై టీడీపీ నేతల స్పందనల వార్తల కవరేజీ సంగతి సరేసరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: