తెలంగాణలో మంత్రి కేటీఆర్ ని ఎదుర్కోవడం అనేది అంత సులువు కాదు. మంత్రి కేటీఆర్ రాజకీయం కూడా ఊహకందని విధంగా ఉంటుంది. రాజకీయంగా ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా చెప్పటం చాలా కష్టంగా ఉంటుంది. ప్రధానంగా ఎన్నికల నిర్వహణ విషయంలో మంత్రి కేటీఆర్ వ్యవహరించే దూకుడు పై చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆయన క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న నేత కావడంతో ఆయనను ఎదుర్కోవడం అనేది ఇతర పార్టీలకు దాదాపుగా కష్టంగానే ఉంటుంది అనే మాట అక్షరాలా నిజం.

అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే... మంత్రి కేటీఆర్ ని బీజేపీ నేతలు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కచ్చితంగా కేటీఆర్ ను ఎదుర్కొని రాజకీయం చేయాలి. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి ఆయనతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆయనతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చేస్తున్న అవినీతి కార్యక్రమాలు అదేవిధంగా నియోజకవర్గాల్లో వారు ఎన్నికైన తర్వాత ఏమీ చేయలేకపోయారు అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.

దాని ద్వారా ఇబ్బంది పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు కేటీఆర్ కి చాలా సన్నిహితంగా ఉంటారు. దీంతో వారందరి మీద కూడా ఫోకస్ పెట్టి ఇబ్బంది పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారట. దీనిని కూడా కేటీఆర్ సమర్థవంతంగా ఎదుర్కోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో కేటీఆర్ ని టార్గెట్ చేయాలని భావిస్తున్నారు. ఆయన పురపాలక శాఖ మంత్రి కావడంతో ఇప్పుడు ఆయన పని తీరును ప్రశంసిస్తూ విమర్శలు చేయాలని బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఇవి ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: