ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఇతర పార్టీ లోకి వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం కూడా భవిష్యత్తు లేకపోయిన నేపథ్యంలో ఇతర పార్టీ లోకి వెళ్ళడానికి ఎక్కువగా చాలా మంది నేతలు కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా చాలామందికి భరోసా ఇచ్చిన సరే ఎవరు కూడా ఇప్పుడు పార్టీలో ఉండడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో కూడా ఇప్పుడు ఒక రకమైన ఆందోళన అనేది నెలకొంది.

నారా లోకేష్ కూడా ఇప్పుడు పార్టీలో ఉన్న కొంత మంది నేతలతో చర్చలు జరిపి పార్టీలో ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసిన సరే అది పెద్దగా ఫలించడం లేదు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్సీలు బయటకు వెళ్లి పోయే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ అదేవిధంగా విశాఖకు చెందిన  ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు బయటికి వెళ్లి పోవడానికి మార్గం సుగమం చేసుకున్నట్లుగా సమాచారం.

త్వరలోనే గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రాయలసీమ జిల్లాలకు చెందిన బీటెక్ రవి కూడా ఇప్పుడు నుంచి బయటకు వెళ్లి పోవడానికి మార్గం సుగమం చేసుకున్నారు అని అంటున్నారు. త్వరలోనే వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై  చెప్పే రోజు దగ్గరలోనే ఉందని... అయితే ఎప్పుడు అనే దానిపై ఇంకా స్పష్టత లేదని, దీపావళి లోపు పార్టీ మారవచ్చని అంటున్నారు. మరి ఎవరు మారుతారు అనేది త్వరలోనే స్పష్టత రానుంది. చూడాలి మరి అసలు ఆ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో...

మరింత సమాచారం తెలుసుకోండి: