దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే రికవరీ రేటు పెరుగుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా 60 వేల కంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో కేవలం 8.50 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.

దేశంలో కొత్తగా 50వేల మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78లక్షల 64వేల 811కి చేరింది. గడిచిన 24 గంటల్లో 578 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య లక్షా 18వేల 534కి చేరింది.  దేశ వ్యాప్తంగా కొత్తగా 62వేల మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 70లక్షల 78వేల 123 మంది కోలుకున్నట్లు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 6లక్షల 68వేల 154 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దాదాపు 90 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తెలంగాణలో గడిచిన 24గంటల్లో 978 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2లక్షల 31వేల 252కి చేరింది. ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 13వందల 7కి చేరింది. కరోనా బారి నుంచి ఒక్క రోజే 1,446 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2లక్షల 10వేల 480కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19వేల 465 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇక ఏపీలో కొత్తగా 2వేల 997 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 67వేల 419 నమూనాలను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8లక్షల 7వేల 23కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ 21 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,587కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 75లక్షల  70వేల 352 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.



మరింత సమాచారం తెలుసుకోండి: