ఇటీవలే చిత్తూరు లో చైనా యువకుడి అరెస్టు ఆసక్తికరం గా మారి పోయింది. ఇక చైనా యువకుడు అరెస్టు కావడం తో స్థానికం గా ఈ ఘటన కల కలం సృష్టించింది. యువకుడి అరెస్టు వెనుక కూడా ఆసక్తి కారణం ఉన్నట్లు తెలిసింది. చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు సమీపం లో పోలీసులు చైనా యువకుడిని అరెస్టు చేశారు. ఏర్పేడు సమీపం లో పాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. చైనా కు చెందిన జొయోంగ్ హుయి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.



 5 లక్షల రూపాయలతో సదరు కంపెనీలో మిషనరీ బిగించేందుకు చేంజెస్ డీల్ మాట్లాడుకున్నారు. ఇక ఈ క్రమంలో నే సదరు కంపెనీలో మిషనరీ బిగించేందుకు చైనా కు చెందిన  వ్యక్తి ఇండియాకి వచ్చాడు. ఇక కంపెనీలో  మిషనరీ బిగించే క్రమం లో చైనాకు చెందిన సదరు వ్యక్తి అనవసరమైన కేవలం కూడా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీకీ  మాత్రం  ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. అనవసరమైన కేబుల్ కట్ చేయడంతో సంస్థకు ఏకంగా పది కోట్లు నష్టం వాటిల్లింది.




 కంపెనీ మేనేజర్ వెంటనే పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు చైనా యువకుడి పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారు. సదరు వ్యక్తి  ఉద్దేశపూర్వకంగానే కేబుల్ ను కట్ చేసి ఉంటాడని అటు సంస్థ భావిస్తోంది. జొయోంగ్ హుయి  సంస్థ ప్రేరేపించడంవల్లే అనవసరమైన చేంజెస్ కేబుల్ లను సదరు వ్యక్తి కట్ చేసి ఉంటాడని ఫ్రాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆరోపిస్తోంది. 5 లక్షల ఒప్పందం కుదుర్చుకుంటే... సదరు వ్యక్తి చేసిన పనికి తమ సంస్థకు ఏకంగా పది కోట్ల నష్టం వాటిల్లింది అంటూ చెప్పుకొచ్చారు సంస్థ మేనేజర్.

మరింత సమాచారం తెలుసుకోండి: