దేశంలో ప్రస్తుతం బీహార్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి.. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీని ఎంచుకోవటంతో రాజకీయాల్లో గొప్ప మార్పులు వచ్చాయని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. 15 సంవత్సరాల ముందుకు ఇప్పటికి బీహార్ లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. వీటన్నిటికి కారణం మోదీయో అని వెల్లడించారు. బీహారుకు గుర్తింపు తెచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో కూడా ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రావటం ఎంతో ఆనందించాల్సిన విషయం అని యూపీ సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.  పేదరికాన్ని రూపుమాపటానికి గరీబ్ కల్యాణ్ స్కీంను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ అభివృద్ధి బాటలో సాగిందని ఆదిత్యనాథ్ కితాబు ఇచ్చారు. అయితే బీహార్ లో మొదటిదశ ఎన్నికలు పూర్తయింది. ఈసారి కూడా నితీష్ సీఎం అవుతాడా లేదా అనేది ప్రజలే తేల్చాలని సీఎం యోగీ పేర్కొన్నాడు. కరోనా సమయంలోనూ ఎన్నికలకు ముందుకు వచ్చిన ఏకైక రాష్ట్రం బీహార్ కావటం విశేషమన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: