ఇండియన్ రైల్వేస్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) గురించి తెలియని వారుండరూ. ఐఆర్‌సీటీసీలో అకౌంట్ ఉన్న వారు ఈజీగా ఆన్ లైన్ లో రైలు టికెట్ ను బుక్ చేసుకుంటారు. దీని కోసం రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ తో పాటు యాప్ ని కూడా అందుబాటులో తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆధార్ కార్డు నంబర్ ను ఐఆర్‌సీటీసీ అకౌంట్ కు లింక్ చేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చు. ట్రైన్ జర్నీ చేయాలని భావించే వాళ్లు కొందరు క్యూలో నిల్చోవడానికి ఇబ్బంది పడకుండా ఐఆర్‌సీటీసీ ద్వారా తమ టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. వారికి టికెట్ కు సంబంధించిన వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో రిజస్టర్డ్ మొబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. ఒక నెలలో ఐఆర్‌సీటీసీ ద్వారా గరిష్టంగా ఆరు టికెట్ల వరకు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు రైల్వేశాఖ ఆ సంఖ్యను పెంచింది. నెలలో ఆరు నుంచి పన్నెండు వరకు టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

దీనికోసం ప్రయాణికులు ఐఆర్‌సీటీసీలో ఆధార్ కార్డు నంబర్ ను లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకోవాలని అనుకుంటే ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ఓపెన్ చేసుకోవాలి. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆధార్ కేవైసీపై క్లిక్ చేసి మీ డిటేల్స్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసి సబ్ మిట్ చేయాలి. మీ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు సులభంగా నెలకు పన్నెండు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆరుగురి కన్నా ఎక్కువ మందికి టికెట్ బుక్ చేయాలనుకున్నప్పుడు కచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాలి. అప్పుడే మీరు టికెట్లు బుక్ చేసుకోగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: