సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయినప్పటినుండి చెప్పిన ప్రతి ఒక్క విషయం తూచా తప్పకుండా నెరవేర్చుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సరికొత్తగా నిన్న ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ వైద్య మరియు ఆరోగ్య రంగాలను మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేసాడు. దీనికి గాను భారీ మొత్తంలో నిధులను కేటాయించారు. మరి వైద్య ఆరోగ్య రంగాల్లో ఏ ఏ అంశాలను అభివృద్ధి చేయనున్నారో కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా వైద్యం మరియు ఆరోగ్యం విషయంలో దారుణంగా విఫలమైంది. ఇప్పుడు ఈ రంగాలను బలోపేతం చేయడానికి నాడు నేడు కార్యక్రమం ద్వారా 17 ,300  కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం తెలిపారు. అదేవిధంగా కొత్తగా నిర్మించే 16 మెడికల్ కాలేజీలకు సంబంధించిన టెండర్ పనులను జనవరి లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇంతకుముందే ఉన్న మెడికల్ కాలేజీలలో సౌకర్యాలను మరింత పెంచాలని, ఏమైనా మరమ్మతులు ఉంటే సత్వరమే వాటిని బాగు చేయాలని సూచించారు. ఇకనుండి ఆసుపత్రులలో ప్రతి ఒక్క పరికరం సక్రమంగా పనిచేయాలి. దీనికి ఆసుపత్రిలో వారు ప్రత్యకంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈసారి ప్రజల దగ్గరనుండి ఆసుపత్రిలో ఏదైనా బాగోలేదని ఫిర్యాదు వస్తే...పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  

ఇప్పుడు మనం నిర్మించే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఆసుపత్రులకన్నా ధీటుగా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో వారికి ఏమాత్రం తగ్గకుండా అన్ని అంశాలలో అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తెలిపారు. ఆరోగ్య శ్రీ విధానంలో ఇప్పటికీ ప్రజలు సమస్యలను ఎదుర్కుంటూ ఉన్నారు. దీనిని గ్రామాలలో ఉన్న ఎ ఎన్ ఎమ్ లు మరియు హెల్త్ అసిస్టెంట్ లు ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని వారికి తెలియచేసారు. పై విధంగా ఆరోగ్యం మరియు వైద్య రంగాలకు సంబంధించి జగన్ తీసుకున్న నిర్ణయాలు భేషుగ్గా ఉన్నాయని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: