ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి గా ఉన్న సంగతి తెలిసిందే. అయినా సరే కొంతమంది నేతలు ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇచ్చేది లేదు అని ఎప్పటికప్పుడు కొత్త లింకులు పెడుతూ వస్తుంది. దీనిపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఉన్న అధికార విపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

అయితే రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మాత్రం ఎప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం నిధులు అడిగే ప్రయత్నం కూడా చేయడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతా అనే మాట మాట్లాడలేదు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీని బిజెపిలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్లుగా విమర్శలు కూడా వస్తున్నాయి. బీజేపీతో ఇప్పటికే పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ కనీసం పోలవరం ప్రాజెక్టు  విషయంలో ఇంత జరుగుతున్న సరే ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు.

 హైదరాబాద్ వరదలపై పూర్తిస్థాయిలో స్పందించిన పవన్ కళ్యాణ్ ఏకంగా పారిశ్రామికవేత్తలను కూడా విమర్శించిన పరిస్థితి మనం చూశాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్ట్ గురించి ఈ స్థాయిలో ఇబ్బందులు ఉన్నా సరే ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనితో పవన్ కళ్యాణ్ జై జనసేన కార్యకర్తలు కూడా ఆగ్రహం గానే ఉన్నారు.  రాష్ట్రంలో జనసేన పార్టీ బలపడాలంటే సమస్యల మీద మాట్లాడటం మానేసి పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఏంటి అంటూ కొంతమంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి భవిష్యత్తులో అయినా సరే పవన్ కళ్యాణ్ లో మార్పు వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: