ఎన్నో రోజుల నుంచి తెలంగాణ లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఎంతో వ్యూహాత్మకం గా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.  తెలంగాణ లో బీజేపీ పార్టీని మరింత బలో పేతం చేసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది బిజెపి. తెలంగాణ లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ  షాక్ తగిలి నప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బిజెపి వ్యూహాత్మకం గా వ్యవహరించి విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించి టీఆర్ఎస్కు షాక్ ఇచ్చింది. మొన్నటికి మొన్న ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించి... టిఆర్ఎస్ కు మరో భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.



 ఇలా క్రమక్రమం గా బిజెపి రాష్ట్రం లో తమ కేడర్ పెంచుకునేందుకు ఎన్నో రకాలు గా ప్రయత్నాలు చేస్తుంది. ఇక మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యం లో ఈ ఎన్నికల్లో  మరింత వ్యూహాత్మకం గా వ్యవహరించి టిఆర్ఎస్ కు మరోసారి భారీ షాక్ ఇవ్వాల ని భావిస్తుంది ఉంది బీజేపీ.  ఎంతో మందికి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. బిజెపి తరఫున జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి  ఉన్న  వారి బయోడేటా ను స్వీకరించేందుకు సిద్ధమైంది బిజెపి.



నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆశా వాహుల కు సంబంధించిన బయో డేటా లను ఆయా జిల్లాల అధ్యక్షులు తీసుకోనున్నారు. గ్రేటర్ పరిధిలో ఆరుగురు అధ్యక్షులను  బిజెపి నియమించింది. డివిజన్ల వారీగా వారు అభ్యర్థులకు పనితీరుపై సర్వే నిర్వహించి వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు నిర్ణయించనుంది  బిజెపి. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఊహించని ఎత్తుగడ అని అంటున్నారు విశ్లేషకులు. ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్నది రానున్న రోజుల్లో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: