తెలంగాణాలో లాగే ఏపీ లో కూడా బీజేపీ బలపడాలని చూస్తుంది.. తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించి తమ సత్తా చాటాలని భావిస్తుంది. దానికి తగ్గట్లే బీజేపీ పార్టీ కి అన్ని అంశాలు అనుకులిస్తున్నాయి.. ప్రజల్లోకి కూడా బాగానే దూసుకువెళ్తుంది.. కేంద్రంలోని బీజేపీ పార్టీ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధికారంలోకి రావాలని సోము వీర్రాజు ని లైన్ లోకి దించింది.మొదట్లో కాస్త కాం గా ఉంటూ పెద్దగా ప్రజల నోట్లో నానని సోము ఆ తర్వాత తన చర్యలతో, కార్యచరణలతో పార్టీ ని కొద్ది కాలంలోనే బలోపేతం చేశారు.. దానికి ప్రజలు సైతం ఎంతో ఆశ్చర్య పోయారు.. RSS  విధానాలను ఎక్కువగా పాటించే సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దేవాలయాల దాడుల విషయంలో చేసిన హడావుడి అంతా ఇంతాకాదు..

వరుస విమర్శలతో, దాడులతో ప్రభుత్వం సిబిఐ విచారణ వేయించేందుకు కీలక కారణమయ్యారు.. అంతేకాదు ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలకు బీజేపీ పార్టీ హస్తం పరోక్షంగా ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..  అయితే భవిష్యత్ లో సోము ఇలాంటి నిర్ణయాలు మరిన్ని తీసుకుంటే పార్టీ ఇంకా ఇంకా బలపడడం ఖాయమని ఆయన్ని ఫ్రీ గా ఉంచడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది..ఇప్పటి వరకు బీజేపీ తరపున చక్రం తిప్పిన వారిని పక్కన పెట్టి సోము వీర్రాజుకు కావాల్సిన టీమ్‌ను ప్రిపేర్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారని చెబుతున్నారు. అదే విధంగా రాష్ట్రంలో కొద్దోగొప్పో ప్రభావం చూపుతారనుకున్న నాయకుల్ని కూడా కేంద్రకమిటీ పేరుతో అధిష్టానం తమ గుప్పిట్లోనే పెట్టుకున్నారు.

ఇక ఇతరపార్టీల చేరికల కోసం బీజేపీ కొంత విభిన్నమైన పాలసీని తలపిస్తుంది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి నిజంగానే మెరుగుపడింది. ఇప్పుడు… ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం… జిమ్మిక్కులకు పాల్పడి..ఆ విధంగా మెరుగుపడటం అనేది… అపోహే అన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ బలంగా మారితే.. నేతలే వచ్చి చేరుతారు. ఆ విషయం బీజేపీ నేతలకు తెలియనిది కాదు. కానీ ఇతర పార్టీల్ని బలహీనం చేయాలనో… తాము ఇన్‌స్టంట్‌గా బలబపడాలనో.. చేరికల్ని ప్రోత్సహించడానికి తాము దిగజారితే.. పార్టీ కూడా దిగజారిపోతుంది అని అంటున్నారు..మరో బీజేపీ నేతలు ఇవి ఆపేసి తమ స్థాయి మైంటైన్ చేస్తే మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: