ప్రస్తుతం యువత. ఈజీగా డబ్బులు సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నారు.. కరోనా వల్ల పని కోల్పోయిన చాలా మంది యువత సులువైన మార్గంలో డబ్బులు సంపాదించాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అంతేకాదు అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారు... ముఖ్యంగా చెప్పాలంటే పేకాట, క్రికెట్ బెట్టింగులకు సంబంధించిన వాటి పై మోజుతో ముందుకు సాగుతున్నారు..



ఆంధ్రా, తెలంగాణలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.. ప్రభుత్వం , పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న వీటిలో చాలా వరకు నష్టాలను చూసిన వారంతా ప్రాణాలను కోల్పోతున్నారు. ఆంధ్రాలో మాత్రం ఆన్ లైన్ రమ్మీలు, ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగులు పెడుతూ తీవ్ర నష్టాలను చూడటంతో పాటుగా ప్రాణాలను కోల్పోతున్నారు.. ఇటీవల గుంటూరు లో జరిగిన ఘటన క్రికెట్ లో బెట్టింగ్ పెట్టీ లక్షల్లో నష్టాలను చూసి చనిపోయారు. ఆ ఘటన పూర్తిగా మరువక ముందే మరో ఘటన పేకాటలో డబ్బులు వస్తాయి ఆడి ఓ వ్యక్తి ప్రాణాలను తీసుకున్నారు..ఇలా ఇప్పుడు చాలా ఘటనలు వెలుగు చూశాయి..



ఈ మేరకు ఆంధ్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.. ఆన్ లైన్ రమ్మీ లను పూర్తిగా నిషేదించాలని పోలీస్ శాఖ తో పాటుగా సంభందిత అధికారులకు సూచించారు.. అయితే ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం మద్దతు తెలుపుతుంది. తమిళనాడులో రమ్మీ ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. ఆర్నెళ్లు జైలు శిక్ష తో పాటుగా , ఐదు వేలు జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఆన్ లైన్ పేకాట క్లబ్ నడిపితే మాత్రం రెండేళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.. ఆన్ లైన్ పేకాట వల్ల ప్రాణాలను కోల్పోతున్నారని తెలపడంతో రాష్ట్ర గవర్నర్ కూడా వెంటనే ఆమోద ముద్ర తెలిపినట్లు సమాచారం.. ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ప్రజల్లో మార్పులు వస్తాయో లేక అలానే డబ్బు ఆశ తో కొనసాగుతారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: