తెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పార్టీని బలోపేతం చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. అయితే కొన్ని కొన్ని ఇబ్బందులు ఆయనను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధానంగా కొన్ని కొన్ని వ్యవహారాల్లో ఆయన తీరుపై విమర్శలు ఎక్కువగా వస్తున్నసంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు బిజెపి రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన విషయంలో కాస్త అసహనం గానే ఉంది అని చెప్పాలి. బలమైన నేతలు విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ అధిష్టానం కూడా ఆయన వ్యవహార శైలిపై ఇప్పుడు కాస్త సీరియస్ గా ఉంది అనే ప్రచారం జరుగుతుంది.

బలమైన నేతలను నిలబెట్టుకునే విషయంలో బండి సంజయ్ సమర్థవంతంగా వ్యవహరించలేదని దీని ద్వారా బిజెపి కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నారని బిజెపి జాతీయ నాయకత్వానికి సమాచారం వెళ్ళింది. దీంతో ఆయనకు ప్రచార బాధ్యతలను తగ్గించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సొంత వ్యవహారాలూ ఎక్కువగా చేస్తున్నారు అని ఆరోపణలు బండి సంజయ్ ఎక్కువగానే వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం మాత్రం అప్రమత్తమవుతుంది. ఈ పరిస్థితులు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రంగా కష్టపడుతుంది.

కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు ఉంటాయి అని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా చెప్తుంది. రాజాసింగ్ వ్యవహారం విషయంలో బండి సంజయ్ దే తప్పు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. నియోజకవర్గంలో రాజాసింగ్ చెప్పిన వారికి కూడా సీట్లు ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంటి అనే దానిపై పలువురు మండిపడుతున్నారు. రాజాసింగ్ 2018 ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయినా సరే ఆయన విషయంలో ఇప్పుడు బిజెపి రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు, బండి సంజయ్ ప్రవర్తిస్తున్న విధానం పై బిజెపి కార్యకర్తలు చాలా సీరియస్ గా  ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: