2019 ఎన్నికల్లో జనసేన ఎలాంటి ఫలితాలు చవిచూసిందో తెలిసిందే. ఆ పార్టీ కేవలం ఒక సీటునే గెలుచుకుంది. అటు బీజేపీ దారుణంగా ఎక్కడా కూడా డిపాజిట్ దక్కించుకోలేదు. ఇక రెండు పార్టీలు కలిసి ఎన్నికలయ్యాక పొత్తు పెట్టుకుని ముందుకెళుతున్నాయి. బీజేపీకి ఏపీలో అంత సీన్ లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల కాస్త హడావిడి చేస్తుంది. అటు జనసేనకు బీజేపీ కంటే బలం ఉన్నా సరే..ఆ పార్టీకే తోక పార్టీలాగా నడుచుకుంటుంది.

పైగా తెలంగాణలో జరుగుతున్నా జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో వీరి పొత్తుపై క్లారిటీ మిస్ అయింది. బీజేపీతో సంబంధం లేకుండా జనసేన పోటీ చేయాలని అనుకుంది. నామినేషన్స్ కూడా వేసింది. అయితే బీజేపీ పెద్దలు పవన్‌తో మాట్లాడటంతో...ఏకంగా ఎన్నికలని జనసేన తప్పుకుంది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్ధతు తెలిపింది. ఇటు ఏపీలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

ఈ స్థానంలో పోటీ చేసి విజయం సాధిస్తామని బీజేపీ చెబుతోంది. అటు జనసేన సైతం తిరుపతిలో పోటీ చేయాలని అనుకుంటుంది. అందుకే తాజాగా పవన్ ఢిల్లీకి కూడా వెళ్లారు. తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధమయ్యామని, అందువల్ల తిరుపతిలో తమకు అవకాశం ఇవ్వాలని కోరేందుకు పవన్‌ సిద్ధమయ్యారు. తిరుపతిలో ఓ బలమైన సామాజికవర్గం ఆది నుంచి జనసేనకు అండగా ఉంటున్న విషయాన్ని పవన్‌ బీజేపీ అధిష్ఠానానికి వివరించి తిరుపతిని దక్కించుకోవాలని చూస్తున్నారు.

అటు బీజేపీ మాత్రం తిరుపతి స్థానాన్ని వదులుకునేలా కనిపించడం లేదు. అయితే ఇక్కడ బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేసిన విడివిడిగా పోటీ చేసిన గెలవడం కష్టమని విశ్లేషుకులు అంటున్నారు. ఈ స్థానంలో అధికార వైసీపీ గెలుపు సులువే అని అంటున్నారు. అలాగే రెండో స్థానంలో టీడీపీ ఉంటుందని, ఇక బీజేపీ కూటమి డిపాజిట్ దక్కించుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉందని మాట్లాడుతున్నారు. ఏదేమైనా జనసేన మాత్రం బీజేపీకి రివర్స్ అయ్యేలానే కనిపిస్తోంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: